Share News

Vaibhav Suryavanshi: సూర్యవంశీ జర్నీపై ఆసక్తికర విషయాలు పంచుకున్న కోచ్

ABN , Publish Date - Apr 29 , 2025 | 01:59 PM

ఐపీఎల్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ జర్నీకి సంబంధించి అతడి చిన్ననాటి కోచ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Vaibhav Suryavanshi: సూర్యవంశీ జర్నీపై ఆసక్తికర విషయాలు పంచుకున్న కోచ్
Vaibhav Suryavanshi

ఇంటర్నెట్ డెస్క్: నిన్నటి ఆర్ఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్.. భారత క్రికెట్ అభిమానులకు వైభవ్ సూర్యవంశీ రూపంలో ఓ ఆణిముత్యాన్ని పరిచయం చేసింది. 35 బంతుల్లో ఐపీఎల్‌లో రెండో అత్యధిక వేగవంతమై సెంచరీ చేసిన సూర్యవంశీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాడు. సహజ ప్రతిభను గుర్తించి, సానపెట్టడంలో కోచ్‌ల పాత్ర ఎంత ముఖ్యమో కూడా సూర్యవంశీ ఉదంతం వెలుగులోకి తెచ్చింది. 14 ఏళ్ల కుర్రాడికి ఐపీఎల్‌లో చోటు దక్కడంలో, అతడికి తన ప్రతిభ ప్రదర్శించే అవకాశాలు ఇవ్వడంలో కోచ్ రాహుల్ ద్రావిడ్ కీలక పాత్ర పోషించారు.


అయితే, సూర్యవంశీ టాలెంట్‌ను మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అంతకుముందే గుర్తించి రాహుల్‌కు రికమెండ్ చేశారట. ‘‘బీసీసీఐ అండర్-19 ఛాలెంజర్స్ మ్యాచ్‌లో ఓసారి వైభవ్ 36కే రనౌట్ అయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్‌లోకొచ్చి కన్నీరు పెట్టుకున్నాడు. ఇది చూసిన లక్ష్మణ్ అతడి వద్దకు వచ్చి ఊరడించాడు. తాము కేవలం పరుగులు మాత్రమే చూడమని, దీర్ఘకాలం కొనసాగే నైపుణ్యం ఎవరికి ఉందో పరిశీలిస్తామని చెప్పారు. బీసీసీఐ కూడా మద్దతుగా నిలిచింది’’ అని సూర్యవంశీ చిన్ననాటి కోచ్ మనోజ్ ఓఝా గతేడాది జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. వీవీఎస్ లక్ష్మణ్ దృష్టిలో పడటం సూర్యవంశీ కెరీర్‌లో కీలక మలుపుగా మారింది. అండర్-19 క్వాండ్రాగ్యులర్ సిరీస్‌కు ఎంపిక చేయాలని లక్ష్మణ్ పట్టుబట్టారు. ఆ తరువాత సూర్యవంశీని రాహుల్ ద్రావిడ్‌కు కూడా రికమెండ్ చేశారు.


రాహుల్ ద్రావిడ్ మార్గదర్శకత్వంలో సూర్యవంశీ ఐపీఎల్ ఆరంగేట్ర మ్యాచ్‌లోనే తన టాలెంట్ ఎంతటిదో ఓ హింట్ ఇచ్చాడు. ఏప్రిల్ 19న ఈ తొలి మ్యాచ్‌‌లో మొదటి బంతికే సిక్స్ బాదాడు. ఈ మ్యాచ్‌లో 34 పరుగులకే పెవిలియన్ బాట పట్టినా అతడి టాలెంట్ మాత్రం జనాలకు అర్థమైపోయింది. ఇక నిన్న జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లోనే సెంచరీ చేసి జనాల ప్రశంసలు అందుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి:

సూర్యవంశీపై శుభమన్ గిల్ కాంట్రవర్షియల్ కామెంట్స్.. వెల్లువెత్తుతున్న విమర్శలు

సూర్యవంశీ శతకం.. సంబరం ఆపుకోలేని రాహుల్ ద్రావిడ్ ఒక్కసారిగా..

చాలా మంది ఆ విషయాన్ని మర్చిపోతున్నారు.. ఛేజింగ్‌ విధానంపై కోహ్లీ కామెంట్

డేటింగ్ వదంతులపై ఎట్టకేలకు స్పందించిన శుభమన్ గిల్

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 29 , 2025 | 02:10 PM