Virat Kohli: చాలా మంది ఆ విషయాన్ని మర్చిపోతున్నారు.. ఛేజింగ్ విధానంపై కోహ్లీ కామెంట్
ABN , Publish Date - Apr 28 , 2025 | 01:35 PM
మ్యాజ్ గెలిచేందుకు పెద్ద భాగస్వామ్యాల పాత్ర కీలకమని కోహ్లీ అన్నారు. చాలా మంది ఈ విషయాన్ని మర్చిపోతున్నారని తెలిపాడు. భాగస్వామ్యలు, నైపుణ్యమైన ఆటతీరుతో ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచాలని చెప్పుకొచ్చాడు.

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీతో నిన్న జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో క్రునాల్ పాండ్య, విరాట్ నెలకొల్పిన 119 పరుగుల భాగస్వామ్యం బెంగళూరు విజయంలో కీలకంగా మారింది. దూకుడుకు కేరాఫ్‌గా నిలిచే కోహ్లీ ఈ మ్యాచ్‌లో సంయమనంతో ఆడుతూ క్రునాల్‌కు అండగా నిలిచాడు. ఛేదనలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. ఛేజింగ్ మాస్టర్ బిరుదుకు తాను పూర్తిగా అర్హుడినని రుజువు చేసుకున్నాడు. బెంగళూరు విజయంపై కోహ్లీ హర్షం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా తన బ్యాటింగ్ విధానం గురించి చెప్పుకొచ్చాడు.
‘‘పిచ్ పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటే ఇది నిజంగా గొప్ప విజయం. గతంలో ఇక్కడి మ్యాచ్‌లను మనం చూశాం. కానీ ఈ ఆటలో పిచ్ పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయి. అయితే, ఛేదనకు ఎప్పుడు దిగినా నేను డగ్‌అవుట్స్‌ను అడిగి పరిస్థితిని తెలుసుకుంటాను. లక్ష్యం దిశగా వెళుతున్నామా లేదా అని ముదింపు వేసుకుంటాను’’
‘‘ఆటలో పరుగులకు బ్రేక్ రాకుండా సింగిల్స్, డబుల్స్‌కు ప్రయత్నిస్తాను. ఈ మధ్య చాలా మంది బ్యాటర్ల భాగస్వామ్యాల గురించి మర్చిపోతున్నారు. కానీ ఈ సీజన్‌లో వాటి ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసింది. సుదీర్ఘ భాగస్వామ్యాలు, నైపుణ్యం కలిగిన ఆట తీరుతో బౌలర్లపై ఒత్తిడి పెంచాలని అందరూ అర్థం చేసుకుంటున్నారు’’
‘‘క్రునాల్ అద్భుతంగా ఆడాడు. ఆటపై తనదైన ముద్ర వేయగలిగే సామర్థ్యం అతడికి ఉంది. ఈ మ్యాచ్‌లో సరైన టైమ్‌లో అది జరిగింది. మ్యాచ్ సందర్భంగా ఇద్దరం చక్కగా కమ్యూనికేట్ అయ్యాము. తాను ఛాన్స్ తీసుకుంటానని, నన్ను ఆగమని క్రునాల్ పలుమార్లు కోరాడు’’ అని విరాట్ చెప్పుకొచ్చాడు.
గేమ్ ఫినిషర్లపై కూడా కోహ్లీ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ‘‘టిమ్ డేవిడ్, జితేశ్ జట్టుకు అదనపు దూకుడును అందించగలరు. మ్యాచ్ చివర్లో పరుగుల వరద కచ్చితంగా జట్టుకు లాభిస్తుంది. ఇప్పుడు ఈ ఇద్దరికీ రొమారియో కూడా తోడయ్యాడు’’ అని కోహ్లీ అన్నాడు. బౌలర్లపై కూడా కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. హేజల్‌వుడ్, భువీ ప్రపంచస్థాయి బౌలర్లని అన్నాడు.
ఇవి కూడా చదవండి:
డేటింగ్ వదంతులపై ఎట్టకేలకు స్పందించిన శుభమన్ గిల్
ఇండియా నుంచి వెళ్లిపోయిన కోహ్లీ ఫ్యామిలీ?.. కారణం ఏంటో తెలిస్తే
IPL 2025 KKR vs PBKS: వర్షం కారణంగా మ్యాచ్ రద్ధు.. ఇరు జట్లకు చెరో పాయింట్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..