Share News

Adelaide Pitch: అడిలైడ్‌ పిచ్‌పై యూవీ లైట్లు

ABN , Publish Date - Oct 22 , 2025 | 02:59 AM

ఆదివారం ఆతిథ్య ఆస్ట్రేలియా, భారత్‌ జట్ల మధ్య జరిగిన తొలి వన్డేకు వర్షం నాలుగుసార్లు అడ్డుపడింది. పెర్త్‌ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌ను వరుణుడి కారణంగా 26 ఓవర్లకు కుదించాల్సి...

Adelaide Pitch: అడిలైడ్‌ పిచ్‌పై యూవీ లైట్లు

ఆస్ట్రేలియాతో భారత్‌ రెండో వన్డేకు ముందు జాగ్రత్త చర్యలు

న్యూఢిల్లీ: ఆదివారం ఆతిథ్య ఆస్ట్రేలియా, భారత్‌ జట్ల మధ్య జరిగిన తొలి వన్డేకు వర్షం నాలుగుసార్లు అడ్డుపడింది. పెర్త్‌ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌ను వరుణుడి కారణంగా 26 ఓవర్లకు కుదించాల్సి వచ్చింది. పదేపదే వర్షం అంతరాయంతో పచ్చికపై తేమ పెరగడం, పిచ్‌ పూర్తిగా బౌలర్లకు అనుకూలించడంతో ఓ దశలో టీమిండియా 45 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొనే గురువారం అడిలైడ్‌ ఓవల్‌ స్టేడియంలో జరిగే రెండో వన్డేకు అక్కడి గ్రౌండ్‌ సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం అక్కడ కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. పిచ్‌పై తేమ శాతం పెరగకుండా ఉండేందుకు అల్ర్టావైలెట్‌ లైట్ల (అతినీలలోహిత కాంతి)తో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అధిక వేడితో కూడుకున్న వెలుతురు వచ్చే ఈ యూవీ లైట్లను పిచ్‌పై ఉంచుతున్నారు. ఇలా చేయడం వల్ల తేమశాతం తగ్గడమే గాకుండా పిచ్‌ పొడిగా ఉంటుంది. అయితే, రెండో వన్డే రోజు అక్కడ వర్షం కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ

అసలు విషయం చెప్పేసిన సీఎం సిద్దరామయ్య.. అదేంటో తెలిస్తే..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 22 , 2025 | 02:59 AM