Usman Ghani World Record: ఒకే ఓవర్‌లో 45 పరుగులు
ABN , Publish Date - Aug 03 , 2025 | 06:09 AM
తన పవర్ హిట్టింగ్‌తో ఒకే ఓవర్‌లో అత్యధికంగా 45 పరుగులు రాబట్టి అఫ్ఘానిస్థాన్ మాజీ బ్యాటర్ ఉస్మాన్ ఘనీ (43 బంతుల్లో 11 ఫోర్లు, 17 సిక్స్‌లతో 153 నాటౌట్) ప్రపంచ రికార్డు...

టీ10 లీగ్‌లో సంచలన రికార్డు
లండన్: తన పవర్ హిట్టింగ్‌తో ఒకే ఓవర్‌లో అత్యధికంగా 45 పరుగులు రాబట్టి అఫ్ఘానిస్థాన్ మాజీ బ్యాటర్ ఉస్మాన్ ఘనీ (43 బంతుల్లో 11 ఫోర్లు, 17 సిక్స్‌లతో 153 నాటౌట్) ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈసీఎస్ టీ10 లీగ్‌లో గిల్డ్‌ఫోర్డ్‌తో మ్యాచ్‌లో లండన్ కౌంటీ తరఫున ఉస్మాన్ సూపర్ ఫీట్ నమోదు చేశాడు. విల్ జర్నీ బౌలింగ్ చేసిన 9 బంతుల ఓవర్‌లో ఒక్క బంతిని మిస్ అయిన ఘనీ.. 5 సిక్స్‌లు, 3 ఫోర్లు బాదాడు. ఇందులో రెండు నోబాల్స్, వైడ్ ఉన్నాయి. కాగా, ఉస్మాన్ కేవలం 28 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. దీంతో లండన్ కౌంటీ 10 ఓవర్లలో 226 పరుగులు చేసింది. ఛేదనలో 115/4 స్కోరుకే పరిమితమైన గిల్డ్‌ఫోర్డ్.. 71 పరుగుల తేడాతో ఓడింది.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి