Share News

India Badminton: సెమీస్‌కు తరుణ్‌, లక్ష్య

ABN , Publish Date - Aug 02 , 2025 | 03:45 AM

తెలుగు కుర్రాడు, వర్ధమాన షట్లర్‌ తరుణ్‌ మన్నేపల్లి మకావు ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో

India Badminton: సెమీస్‌కు తరుణ్‌, లక్ష్య

  • సాత్విక్‌ జోడీ అవుట్‌ 8 మకావు ఓపెన్‌

మకావు: తెలుగు కుర్రాడు, వర్ధమాన షట్లర్‌ తరుణ్‌ మన్నేపల్లి మకావు ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో టైటిల్‌ దిశగా దూసుకెళ్తున్నాడు. ప్రీక్వార్టర్స్‌లో టాప్‌సీడ్‌కు షాకిచ్చి సంచలనం సృష్టించిన తరుణ్‌, అదే జోరులో సెమీఫైనల్‌కు చేరాడు. క్వార్టర్స్‌లో తరుణ్‌ 21-12, 13-21, 21-18తో చైనాకు చెందిన హు ఝెను ఓడించాడు. మరో భారత షట్లర్‌ లక్ష్య సేన్‌ కూడా సెమీస్‌ చేరాడు. క్వార్టర్స్‌లో సేన్‌ 21-14, 18-21, 21-14తో గ్జువాన్‌ చెన్‌ ఝూ (చైనా)పై గెలిచాడు. కాగా, డబుల్స్‌లో భారత స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ శెట్టి పోరాటం క్వార్టర్స్‌కే పరిమితమైంది. సాత్విక్‌ ద్వయం 14-21, 21-13, 20-22తో మలేసియా జంట చూంగ్‌ హాన్‌ జియాన్‌/హైకల్‌ మహ్మద్‌ చేతిలో ఓటమి పాలైంది. ఫైనల్లో చోటు కోసం అల్వి ఫర్హాన్‌ (ఇండోనేసియా)తో లక్ష్య, జస్టిన్‌ హో (మలేసియా)తో తరుణ్‌ అమీతుమీ తేల్చుకోనున్నారు.


ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 02 , 2025 | 03:45 AM