World Junior Badminton Championships: తన్వి రజతంతో సరి
ABN , Publish Date - Oct 20 , 2025 | 02:57 AM
తనకంటే మెరుగైన ప్రత్యర్థులను మట్టి కరిపిస్తూ ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌పలో సంచలనాలు సృష్టించిన భారత షట్లర్ తన్వీ శర్మ జోరుకు ఫైనల్లో బ్రేక్ పడింది. ‘స్వర్ణ’ చరిత్ర సృష్టించాలన్న...
ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్
గువాహటి: తనకంటే మెరుగైన ప్రత్యర్థులను మట్టి కరిపిస్తూ ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌పలో సంచలనాలు సృష్టించిన భారత షట్లర్ తన్వీ శర్మ జోరుకు ఫైనల్లో బ్రేక్ పడింది. ‘స్వర్ణ’ చరిత్ర సృష్టించాలన్న భారత టీనేజర్ కల నెరవేరలేదు. ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్స్‌లో 16 ఏళ్ల తన్వి 7-15, 12-15తో అన్యపత్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి చవిచూసింది. దాంతో ఆమె రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈ టోర్నీలో సైనా నెహ్వాల్, అపర్ణా పొపట్ తర్వాత తుదిపోరుకు చేరిన భారత క్రీడాకారిణిగా తన్వి ఇప్పటికే చరిత్ర సృష్టించింది. ఈ చాంపియన్‌షిప్‌లో సైనా 2008లో స్వర్ణం, 2006లో రజతం, అపర్ణా పొపట్ 1996లో రజతం సాధించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అల్పపీడనం ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
Read Latest AP News And Telugu News