Womens World Cup: సఫారీల ఉత్కంఠ విజయం
ABN , Publish Date - Oct 14 , 2025 | 04:44 AM
మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా మరో అద్భుత విజయాన్నందుకుంది. సోమవారం బంగ్లాదేశ్‌తో ఆఖరి ఓవర్ వరకు ఆసక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్‌లో సఫారీలు 3 వికెట్ల తేడాతో...
నేటి మ్యాచ్
శ్రీలంక X న్యూజిలాండ్
మ.3 నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో
పోరాడి ఓడిన బంగ్లాదేశ్
మహిళల వరల్డ్‌కప్
విశాఖపట్నం స్పోర్ట్స్ (ఆంధ్రజ్యోతి): మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా మరో అద్భుత విజయాన్నందుకుంది. సోమవారం బంగ్లాదేశ్‌తో ఆఖరి ఓవర్ వరకు ఆసక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్‌లో సఫారీలు 3 వికెట్ల తేడాతో గట్టెక్కారు. ముందుగా బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 232/6 స్కోరు సాధించింది. షోర్ణ అక్తర్ (51 నాటౌట్), షర్మీన్ అక్తర్ (50), నిగర్ సుల్తానా (32), ఫర్జానా (30) రాణించారు. ఎంలబాకు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో దక్షిణాఫ్రికా 49.3 ఓవర్లలో 235/7 స్కోరు చేసి నెగ్గింది. 78 రన్స్‌కే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ట్రియోన్ (62), కాప్ (56) 85 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే చివర్లో బౌలర్ల కట్టడితో ఉత్కంఠ పెరిగింది. 8 బంతుల్లో 9 రన్స్ కావాల్సిన వేళ జోరు మీదున్న నదినె డిక్లెర్క్ (37 నాటౌట్) సులువైన క్యాచ్‌ను షోర్ణ వదిలేయడం బంగ్లాను దెబ్బతీసింది. ఇక ఆఖరి ఓవర్‌లో తనే 4,6తో గెలుపునకు కావాల్సిన 8 రన్స్‌ను సాధించి మూడు బంతులుండగానే మ్యాచ్‌ను ముగించింది. నహీదాకు 2 వికెట్లు లభించాయి. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ డిక్లెర్క్ ఆఖరిదాకా నిలిచి విజయాన్నందించిన విషయం తెలిసిందే.
సంక్షిప్త స్కోర్లు
బంగ్లాదేశ్: 50 ఓవర్లలో 232/6 (షోర్ణ అక్తర్ 51 నాటౌట్, షర్మీన్ అక్తర్ 50; ఎంలబా 2/42). దక్షిణాఫ్రికా: 49.3 ఓవర్లలో 235/7 (ట్రియోన్ 62, కాప్ 56, డిక్లెర్క్ 37 నాటౌట్; నహీదా 2/44).
ఈ వార్తలు కూడా చదవండి...
నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్
ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు
Read Latest AP News And Telugu News