Shubman Gill Suryavanhi Controversy: సూర్యవంశీపై శుభమన్ గిల్ కాంట్రవర్షియల్ కామెంట్స్.. వెల్లువెత్తుతున్న విమర్శలు
ABN , Publish Date - Apr 29 , 2025 | 09:32 AM
సూర్యవంశీకి అదృష్టం కలిసొచ్చిందంటూ ఓ జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీకి దారి తీసాయి. ఈ కామెంట్స్‌పై మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఇంటర్నెట్ డెస్క్: నిన్నటి మ్యాచ్‌లో జీటీ బౌలర్లకు ఆర్ఆర్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ చుక్కలు చూపించాడని చెప్పకతప్పదు. మ్యాచ్ తరువాత జీటీ ప్లేయర్ల రియాక్షన్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. బంతిని టచ్ చేస్తే బౌండరీ అన్నట్టు సూర్యవంశీ చెలరేగిపోయాడు.14 ఏళ్ల వయసులో అనుభవజ్ఞుడైన బ్యాటర్‌లా అంతర్జాతీయ స్థాయి జీటీ బౌలర్లపై చెలరేగిపోయాడు. పరుగుల వరద పారించాడు. జీటీ జట్టుకు ఊహించని షాకిచ్చాడు. ఈ నేపథ్యంలో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మ్యాచ్ అనంతరం చేసిన కామెంట్స్ కాంట్రోవర్షియల్‌గా మారాయి. అంతమాట అంటే ఎలా అంటూ జనాలు కస్సుమనేలా చేస్తున్నాయి.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. ఆర్ఆర్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ దూకుడుపై పెద్దగా స్పందించలేదు. ప్రశంసల వర్షం లాంటివేవీ కురిపించలేదు. ముక్తసరిగా జవాబిచ్చే ప్రయత్నం చేశాడు. ‘‘ఇది అతడికి కలిసొచ్చిన రోజు.. లక్కీ డే. అతడి బ్యాటింగ్ అద్భుతం. కలిసొచ్చిన క్షణాలను అద్భుతంగా వినియోగించుకున్నాడు’’ అని చెప్పి సరిపెట్టాడు.
ఈ కామెంట్స్ చూసిన మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతా అదృష్టం అని అనడం సబబు కాదని అన్నాడు. సూర్యవంశీ లాటెంట్‌ను మరింత స్పష్టంగా మెచ్చుకుని ఉంటే బాగుండేదంటూ పరోక్షంగా కామెంట్ చేశాడు.
‘‘ఓ 14 ఏళ్ల కుర్రాడు.. ఆత్మవిశ్వాసంతో.. అంత పెద్ద ఇన్నింగ్స్ ఆడటం సామాన్య విషయం కాదు.. అలాంటప్పుడు లైవ్ టీవీలో ఎవరైనా..ఇదంతా లక్ అని కామెంట్ చేస్తే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మనలో చాలా మంది క్రికెట్ ఆడి ఉంటారు. ఓ స్టైల్‌లో క్రికెట్ ఆడాలని కలలు కని ఉంటారు. ఆ కల ఏదైనా ఇలాగే ఉంటుంది. 14 ఏళ్ల వయసులో మనందరం ఏ పని చేస్తున్నా మైదానంలో ఇలా విజ్ఞంభించాలని అనుకునే ఉంటాము. అయితే, ఈ కుర్రాడు మాత్రం ఆ కలను సాకారం చేసుకున్నాడు. అతడి టాలెంట్‌ను వెలికి తీసిన క్రెడిట్ రాహుల్ ద్రావిడ్, విక్రమ్ రాథోడ్‌కు దక్కుతుంది. అతడికి తన సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు ఓ అవకాశం ఇచ్చారు. ఈ మైండ్ సెట్, ఆలోచనా ధోరణే నన్న కట్టిపడేసింది’’ అని అన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో అత్యధిక వేగవంతమైన సెంచరీ చేసిన వ్యక్తిగా క్రిస్ గేల్ ఉన్న విషయం తెలిసిందే. అతడు 2013లో ఆర్ఆర్ తరుపున బరిలోకి దిగిన అతడు పూణె వారియర్స్‌పై 30 బంతుల్లోనే సెంచరీ బాదాడు.
ఇవి కూడా చదవండి:
సూర్యవంశీ శతకం.. సంబరం ఆపుకోలేని రాహుల్ ద్రావిడ్ ఒక్కసారిగా..
చాలా మంది ఆ విషయాన్ని మర్చిపోతున్నారు.. ఛేజింగ్ విధానంపై కోహ్లీ కామెంట్
డేటింగ్ వదంతులపై ఎట్టకేలకు స్పందించిన శుభమన్ గిల్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..