Gill Workload Management: శుభ్‌మన్ గిల్‌కు పెరుగుతున్న పనిభారం.. మాజీ క్రికెటర్ కీలక కామెంట్
ABN , Publish Date - Nov 20 , 2025 | 10:15 PM
శుభ్‌మన్ గిల్‌కు పనిభారం ఎక్కువైందనుకుంటే ఐపీఎల్ కెప్టెన్సీ బాధ్యతలకు కొంత విరామం ఇవ్వాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అయితే, ప్రస్తుతం అతడి ఫామ్ దృష్ట్యా ప్రతి మ్యాచ్ ఆడటం బెటరని అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: మెడ గాయం కారణంగా శుభమన్ గిల్ దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టెస్టుకు అందుబాటులో ఉండకపోవచ్చు. అయితే, మూడు ఫార్మాట్‌లలో జట్టు కోసం కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న శుభమన్‌గిల్‌కు పని భారం ఎక్కువైందన్న కామెంట్ ఎక్కువగా వినిపిస్తోంది. అయితే, శుభ్‌మన్ గాయమైందని పనిభారం వల్ల కాదని బౌలింగ్ కోచ్ మోర్కెల్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బౌలర్ ఆకాశ్ చోప్రా కీలక సూచన చేశాడు (Shubman Gill).
‘నేను గౌతం గంభీర్‌తో ఇదే విషయంపై మాట్లాడాను. ఐపీఎల్‌కు సారథ్య బాధ్యతలతో పని భారం పెరుగుతోందంటే దానికి దూరంగా ఉండటమే మంచిది. మానసిక, శారీరక అలసట లేదనుకుంటే బ్యాటర్‌గా ప్రతి మ్యాచ్‌లోనూ బరిలోకి దిగొచ్చు. గిల్ ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే అతడు ప్రతి మ్యాచ్ ఆడలి. మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సడెన్‌గా ఫామ్ కోల్పోవచ్చు ఇది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ప్లేయర్లు అందరికీ ఈ అనుభవం ఎప్పుడోకప్పుడు ఎదురయ్యే ఉంటుంది’ అని అన్నాడు.
విరాట్ కోహ్లీ గతంలో అన్ని ఫార్మాట్‌లలో ఆడిన విషయాన్ని ఆకాశ్ చోప్రా గుర్తు చేశారు. ‘వీరాట్ కోహ్లీ కొన్నేళ్ళ పాటు అన్ని ఫార్మాట్‌లో ఆడాడు. ఒక్కసారి కూడా బ్రేక్ తీసుకోలేదు. దూకుడు కూడా తగ్గలేదు. నాకు తెలిసి శుభ్‌మన్ గిల్ కూడా అదే మార్గంలో వెళుతున్నాడు. ఇసారి అనుకోకుండా గాయం బారినపడ్డాడు. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు. ప్రస్తుతం గిల్ మూడు ఫార్మాట్‌లలో కీలక ప్లేయర్‌గా ఉన్న విషయం తెలిసిందే. గుజరాత్ టైటన్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. టీ20 టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇక గాయం నుంచి గిల్ క్రమంగా కోలుకుంటున్నాడని బీసీసీఐ ఇటీవల తెలిపింది. దక్షిణాఫ్రికాతో రెండో టెస్లులో గిల్ పాల్గొంటాడా లేదా అనేది త్వరలో తేలుస్తామని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
టీ20 వరల్డ్ కప్ ముందు భారత్‌కు గుడ్‌న్యూస్
ముంబై ఇండియన్స్‌లోకి విధ్వంసకర ప్లేయర్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి