Share News

Shubman Gill On Dating Rumours: డేటింగ్ వదంతులపై ఎట్టకేలకు స్పందించిన శుభమన్ గిల్

ABN , Publish Date - Apr 28 , 2025 | 08:10 AM

తాను మూడేళ్లుగా సింగిల్‌గానే ఉన్నానని టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. ప్రస్తుతం తన దృష్టి అంతా కెరీర్‌పైనే అంటూ డేటింగ్ వదంతులకు తాజా ఇంటర్వ్యూలో చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు.

Shubman Gill On Dating Rumours: డేటింగ్ వదంతులపై ఎట్టకేలకు స్పందించిన శుభమన్ గిల్
Shubman Gill On Dating Rumours

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్.. తన ఆటతీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే, అతడి వ్యక్తిగత జీవితం కూడా తరచూ వార్తల్లోకి చేరుతుంటుంది. సారా టెండుల్కర్, బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌తో అతడిని లింక్ చేస్తూ నిత్యం ఏదోక వార్త వైరల్ అవుతుంది. ఇలాంటి వదంతులపై పెద్దగా స్పందించని శుభమన్ గిల్ తొలిసారిగా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. రూమర్స్ అన్నింటికీ ఒక్కసారిగా చెక్ పెట్టేశాడు.

తన డేటింగ్ లైఫ్‌కు సంబంధించిన వార్తలన్నీ అభూతకల్పనలేనని శుభ్‌మన్ గిల్ తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. తాను కొన్నేళ్లుగా సింగిల్‌గానే ఉంటున్నట్టు చెప్పుకొచ్చాడు. ‘‘నా డేటింగ్ గురించి పలు వందతులు ఉన్నాయి. వివిధ వ్యక్తులతో నన్ను లింక్ చేశారు. వాస్తవం ఏంటంటే.. నేను మూడేళ్లుగా సింగిల్ గానే ఉన్నాను. నేను ఎప్పుడూ చూడని, కలవని వ్యక్తులతో కూడా లింక్ పెట్టేస్తున్నారు. ఇది నిజంగా హాస్యాస్పదం’’ అంటూ తన వ్యక్తిగత జీవితం గురించి క్లారిటీ ఇచ్చాడు.


ప్రస్తుతం తాను కెరీర్‌పైనే ఫోకస్ పెట్టినట్టు శుభ్‌మన్ గిల్ తెలిపాడు. రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లకు ప్రస్తుతం తన జీవితంలో స్థానం లేదని అన్నాడు. తాను ఏడాదిలో 300 రోజులు క్రికెట్ ఆడేందుకు ఎటో అటు వెళ్లి వస్తూ ఉంటానని, రొమాంటిక్ రిలేషన్‌షిప్‌‌లపై వెచ్చించేంత సమయం తనకు లేదని స్పష్టం చేశాడు.

ఇటీవల జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో శుభమన్ గిల్ తన ప్రతిభ చూపించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా అప్రతిహతంగా అన్ని మ్యాచుల్లో గెలిచి విజేతగా నిలిచింది. 2023 వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడిన జట్టు తరపున కూడా శుభ్‌మన్ గిల్ తన సత్తా చాటాడు.


గుజరాత్ టైటన్స్ టీంకు కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీబిజీగా ఉన్నాడు. ఐపీఎల్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం శుభమన్‌కు ఇది రెండోసారి. ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో జీటీ 12 పాయింట్లతో టాప్‌లో ఉంది. ఈ సీజన్‌లో గిల్ ఇప్పటివరకూ 305 పరుగులు చేసి టాప్ స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు.

ఇవి కూడా చదవండి:

ఇండియా నుంచి వెళ్లిపోయిన కోహ్లీ ఫ్యామిలీ?.. కారణం ఏంటో తెలిస్తే

IPL 2025 KKR vs PBKS: వర్షం కారణంగా మ్యాచ్ రద్ధు.. ఇరు జట్లకు చెరో పాయింట్

ఆసియా బాక్సింగ్‌లో 43 పతకాలు ఖాయం

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 28 , 2025 | 08:18 AM