Share News

Badminton Semifinals: సెమీస్‌లో సాత్విక్‌ జోడీ

ABN , Publish Date - Jul 26 , 2025 | 01:57 AM

చైనా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ డబుల్స్‌ ద్వయం సాత్విక్‌ సాయిరాజ్‌..

Badminton Semifinals: సెమీస్‌లో సాత్విక్‌ జోడీ

  • ముగిసిన ఉన్నతి పోరుజూ చైనా ఓపెన్‌

చాంగ్‌ఝౌ: చైనా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ డబుల్స్‌ ద్వయం సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ షెట్టి జోడీ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే మహిళల సింగిల్స్‌లో వర్ధమాన షట్లర్‌ ఉన్నతి హుడా పయనం ముగిసింది. డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో సాత్విక్‌/చిరాగ్‌ జోడీ 21-18, 21-14తో మలేసియా జంట ఆంగ్‌ యూ సిన్‌/టో యీ యీని చిత్తు చేసింది. ఇక పీవీ సింధుకు ప్రీక్వార్టర్‌ ఫైనల్లో షాకిచ్చిన ఉన్నతి..వరల్డ్‌ నెం. 4 అకానె యమగూచి చేతిలో పరాజయం చవిచూసింది. క్వార్టర్‌ఫైనల్లో హుడా 16-21, 12-21తో యమగూచి (జపాన్‌) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.


ఇవి కూడా చదవండి

వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

For More Andhrapradesh News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 01:57 AM