Share News

Saina Nehwal: కలిసే ఉంటాం

ABN , Publish Date - Aug 03 , 2025 | 06:12 AM

మాజీ షట్లర్‌ పారుపల్లి కశ్య్‌పతో దాంపత్య జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు ఇటీవలే ప్రకటించిన బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ యూటర్న్‌ తీసుకుంది. భర్త కశ్యప్‌ నుంచి...

Saina Nehwal: కలిసే ఉంటాం

కశ్యప్‌తో విడిపోవాలన్న నిర్ణయంపై సైనా యూటర్న్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన షట్లర్‌

హైదరాబాద్‌: మాజీ షట్లర్‌ పారుపల్లి కశ్య్‌పతో దాంపత్య జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు ఇటీవలే ప్రకటించిన బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ యూటర్న్‌ తీసుకుంది. భర్త కశ్యప్‌ నుంచి విడిపోవాలన్న నిర్ణయంపై పునరాలోచన చేస్తున్నట్టు సైనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో శనివారం పోస్ట్‌ చేసింది. ‘కొన్నిసార్లు దూరం.. వర్తమానం విలువను తెలియజేస్తుంది. మళ్లీ కలిసిపోయేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్న సైనా.. కశ్యప్‌తో కలిసున్న ఫొటోను షేర్‌ చేసింది. కశ్యప్‌ నుంచి విడిపోతున్నట్టు గతనెల 13న సైనా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లపాటు ప్రేమించుకున్న వీళ్లిద్దరూ 2018లో పెళ్లితో ఒక్కటయ్యారు.

ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 03 , 2025 | 06:12 AM