Rishabh Pant: మనం దేశం కోసం గెలుద్దాం.. చివరి టెస్ట్‌కు దూరమైన రిషభ్ పంత్ ఎమోషనల్ లెటర్..
ABN , Publish Date - Jul 28 , 2025 | 06:35 PM
నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాదానికి తీవ్ర గాయమైంది. ఆ గాయంతోనే తర్వాతి రోజు బ్యాటింగ్‌కు దిగిన పంత్ అర్ధశతకం సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో పంత్ బ్యాటింగ్‌కు దిగాల్సిన అవసరం రాలేదు. గాయం కారణంగా ప్రస్తుత సిరీస్‌లో చివరి టెస్ట్ మ్యాచ్‌కు పంత్ దూరమయ్యాడు.

ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌లో అద్భుత ఆటతీరుతో పాటు పోరాట పటిమను ప్రదర్శించిన యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) గాయం కారణంగా ఐదో టెస్ట్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాదానికి తీవ్ర గాయమైంది (Rishabh Pant Injury). ఆ గాయంతోనే తర్వాతి రోజు బ్యాటింగ్‌కు దిగిన పంత్ అర్ధశతకం సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో పంత్ బ్యాటింగ్‌కు దిగాల్సిన అవసరం రాలేదు. గాయం కారణంగా ప్రస్తుత సిరీస్‌లో చివరి టెస్ట్ మ్యాచ్‌కు పంత్ దూరమయ్యాడు (Ind vs Eng).
'దేశం తరఫున ఆడడాన్ని ఎప్పుడూ గౌరవంగానే భావిస్తుంటా. నా మీద ప్రేమ కురిపించిన అందరికీ ధన్యవాదాలు. నాకు మీ అభిమానం కొండంత బలాన్ని అందిస్తుంది. నా ఫ్రాక్చర్ తగ్గిన తర్వాత తిరిగి సాధన ప్రారంభిస్తా. మళ్లీ మైదానంలోకి దిగి వంద శాతం ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో జట్టు సభ్యులంతా నాకు అండగా నిలిచారు. గయ్స్.. మనం చివరి టెస్ట్ మ్యాచ్‌లో గెలవాలి. దేశం కోసం చేద్దాం. దేశం కోసం ఆడేటపుడు ఎంత ఒత్తిడినైనా ఎదుర్కొనే మద్దతు అభిమానుల నుంచి లభిస్తుంది' అని పంత్ పేర్కొన్నాడు.
కాగా, గాయంతో కూడా మైదానంలోకి దిగి అద్భుత హాఫ్ సెంచరీ సాధించిన పంత్‌పై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. మాంఛెస్టర్ టెస్ట్ మ్యాచ్‌లో పంత్ చేసిన హాఫ్ సెంచరీనే గొప్ప ఫౌండేషన్ వేసిందని గంభీర్ అన్నాడు. పంత్ హాఫ్ సెంచరీ డ్రెస్సింగ్ రూమ్‌లో గొప్ప స్ఫూర్తిని నింపిందని గంభీర్ కొనియాడాడు. భావితరాల ఆటగాళ్లు కూడా పంత్‌ను చూసి స్ఫూర్తి పొందుతారని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇవి కూడా చదవండి..
ఇంగ్లండ్‌తో 4వ టెస్టు మ్యాచ్ టీమిండియా అద్భుత పోరాటం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..