పంత్ 7 కెరీర్ అత్యుత్తమ ర్యాంక్
ABN , Publish Date - Jun 26 , 2025 | 06:06 AM
భారత్ ధనాధన్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ స్థానానికి చేరాడు. బుధవారం విడుదలైన ర్యాంకింగ్స్ టెస్ట్ బ్యాటర్ల విభాగంలో...

కెరీర్ అత్యుత్తమ ర్యాంక్
దుబాయ్: భారత్ ధనాధన్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ స్థానానికి చేరాడు. బుధవారం విడుదలైన ర్యాంకింగ్స్ టెస్ట్ బ్యాటర్ల విభాగంలో టీమిండియా వైస్-కెప్టెన్ పంత్ ఏడో స్థానం దక్కించుకున్నాడు. ఇంగ్లండ్‌తో హెడింగ్లీ టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లలో శతక మోత మోగించిన పంత్..ఒక ర్యాంక్ మెరుగుపరుచుకున్నాడు. అలాగే మొదటి టెస్ట్‌లో సెంచరీ చేసిన కెప్టెన్ గిల్ కూడా ఐదు స్థానాలు ఎగబాకి 20వ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన బుమ్రా బౌలర్లలో తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు.
ఇవీ చదవండి:
రిషభ్ పంత్ సెంచరీ చేస్తే అదే జరుగుతుందా.. టీమిండియా ఓటమికి అతడే కారణమా..
బుమ్రా రెండో టెస్ట్ ఆడతాడా.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఏం చెప్పాడంటే..
శుభ్‌మన్ గిల్ చెత్త రికార్డు.. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే టీమిండియా ఓటమి ఎలాంటిదంటే..
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి