Share News

BWF Tournaments: గాయంతో సీజన్‌ మొత్తానికి సింధు దూరం

ABN , Publish Date - Oct 28 , 2025 | 03:06 AM

తెలుగమ్మాయి పీవీ సింధు పాదం గాయంతో ఈ సీజన్‌లోని మిగిలిన అన్ని టోర్నమెంట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. వైద్యుల సలహా మేరకు తగిన విశ్రాంతి తీసుకుంటున్నానని, అందుకే మిగిలిన...

BWF Tournaments: గాయంతో సీజన్‌ మొత్తానికి సింధు దూరం

న్యూఢిల్లీ: తెలుగమ్మాయి పీవీ సింధు పాదం గాయంతో ఈ సీజన్‌లోని మిగిలిన అన్ని టోర్నమెంట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. వైద్యుల సలహా మేరకు తగిన విశ్రాంతి తీసుకుంటున్నానని, అందుకే మిగిలిన బీడబ్ల్యూఎఫ్‌ టోర్నీల్లో ఆడలేకపోతున్నానని తెలిపింది. ‘అథ్లెట్ల ప్రయాణంలో గాయాలు సాధారణమే. ఓపికను, సామర్థ్యాన్ని గాయాలు పరీక్షిస్తుంటాయి. తిరిగి బలంగా పునరాగమనం చేస్తా. ప్రస్తుతం వైద్యులు, నిపుణుల పర్యవేక్షణలో చికిత్సతో పాటు అవసరమైన శిక్షణ కూడా తీసుకుంటున్నా’ అని సింధు తెలిపింది. ఇక, చివరగా సింధు గత డిసెంబరులో సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ సూపర్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలిచింది.

ఈ వార్తలు కూడా చదవండి..

రోహిత్ మనసును చదివిన మెజీషియన్

వేధింపుల ఘటన.. నవీ ముంబైలో భారీగా భద్రతా ఏర్పాట్లు

For More Sports News And Telugu News

Updated Date - Oct 28 , 2025 | 03:06 AM