Shubman Gill: నాయర్‌కు మరో అవకాశం..
ABN , Publish Date - Aug 01 , 2025 | 06:08 AM
తొలి మూడు టెస్టుల్లో ఆకట్టుకోలేకపోయిన కరుణ్ నాయర్.. మళ్లీ తుది జట్టులోకి రావడం అందరినీ ఆశ్చర్యపర్చింది. మరోవైపు స్పిన్నర్

తొలి మూడు టెస్టుల్లో ఆకట్టుకోలేకపోయిన కరుణ్ నాయర్.. మళ్లీ తుది జట్టులోకి రావడం అందరినీ ఆశ్చర్యపర్చింది. మరోవైపు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే సిరీ్‌సను ముగించారు. ఇక బుమ్రాకు బదులుగా ఆకాశ్‌దీప్, కాంబోజ్ స్థానంలో ప్రసిద్ధ్‌కృష్ణ జట్టులోకొచ్చారు.
ఓ సిరీ్‌సలో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్‌గా 47 ఏళ్ల కిత్రంనాటి గవాస్కర్ రికార్డును గిల్ అధిగమించాడు. 1978-79లో వెస్టిండీ్‌సతో సిరీ్‌సలో గవాస్కర్ 732 రన్స్ సాధించాడు. కాగా, ఈ ఐదో టెస్ట్‌లో చేసిన 21 రన్స్‌తో ఈ సిరీస్‌లో గిల్ మొత్తం 743 పరుగులు స్కోరు చేశాడు.