Preity zinta hugs Vaibhav: వైభవ్ సూర్యవంశీకి హగ్.. ప్రీతి జింటా స్పందన ఏంటంటే
ABN , Publish Date - May 20 , 2025 | 07:46 PM
బాలీవుడ్ హీరోయిన్, పంజాబ్ కింగ్స్ సహ యజమాని అని ప్రీతి జింటాకు సంబంధించిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ప్రీతి జింటా రాజస్తాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని హగ్ చేసుకున్నట్టు ఉంది.

బాలీవుడ్ హీరోయిన్, పంజాబ్ కింగ్స్ సహ యజమాని అయిన ప్రీతి జింటా (Preity zinta)కు సంబంధించిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ప్రీతి జింటా రాజస్తాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav suryavanshi)ని హగ్ చేసుకున్నట్టు ఉంది. అది నిజమైన ఫొటోనే అని అందరూ భావించారు. ఓ గుజరాతీ పత్రికలో కూడా ఆ వార్త ప్రచురితమైంది. ఆ వార్త ప్రీతి జింటా దృష్టికి వెళ్లింది. దీంతో ఆమె ఆ ఫొటోపై క్లారిటీ ఇచ్చింది (Preity zinta hugging Vaibhav suryavanshi).
ఈ నెల 18వ తేదీన పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చిన ప్రీతి జింటా రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లతో మాట్లాడింది. ఆ సమయంలో పంజాబ్ ఆటగాడు శశాంక్ సింగ్ ప్రీతిని తీసుకెళ్లి వైభవ్‌కు పరిచయం చేశాడు. ఆ సమయంలో ప్రీతికి వైభవ్ షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. వైభవ్‌కు శుభాకాంక్షలు చెప్పిన ప్రీతి ముందుకు వెళ్లిపోయింది. ఆ వీడియోను రాజస్తాన్ రాయల్స్ జట్టు తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
ఆ వీడియోలో ఎక్కడా వైభవ్‌ను ప్రీతి హగ్ చేసుకున్నట్టు కనిపించలేదు. అయితే ఎవరో ఆ వీడియో ఆధారంగా ఆర్టిఫీషియల్ టెక్నాలజీ ఉపయోగించి ఓ మార్ఫింగ్ ఫొటోను రూపొందించారు. వైభవ్ సూర్యవంశీని ప్రీతి హగ్ చేసుకున్నట్టు తయారు చేసి దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది ఫొటో ఫేక్ అని తెలియక ఓ గుజరాతీ పత్రిక ప్రచురించండంతో అది వైరల్‌గా మారింది. అది మార్ఫింగ్ చేసిన ఫేక్ ఫొటో అని ప్రీతి స్పష్టం చేసింది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..