Share News

Meet Messi in Hyderabad: మెస్సీనా మజాకా

ABN , Publish Date - Dec 11 , 2025 | 06:14 AM

ఫుట్‌బాల్‌ సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ భారత్‌ రానుండడం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం.. అందులోనూ అతను హైదరాబాద్‌లో అడుగుపెట్టనుండడం.. ఇక్కడ సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు...

Meet Messi in Hyderabad: మెస్సీనా మజాకా

2 రోజుల్లో.. హైదరాబాద్‌కు

స్టార్‌తో ఫొటో దిగాలంటే రూ.12 లక్షలు

ఫుట్‌బాల్‌ సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ భారత్‌ రానుండడం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం.. అందులోనూ అతను హైదరాబాద్‌లో అడుగుపెట్టనుండడం.. ఇక్కడ సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు సెలెబ్రిటీలంతా సాకర్‌ దిగ్గజంతో కలిసి మైదానంలో కాలు కదపనుండడం.. తారలతో కలిసి మ్యాచ్‌లు, సంగీత కచేరీలు, సత్కార వేడుక, ఫుట్‌బాల్‌ క్లినిక్‌లు.. ఇలా మెస్సీ పర్యటన షెడ్యూల్‌ ఆద్యంతం అత్యంత ఆకర్షణీయంగా మారనుంది. ఆసాకర్‌ మాంత్రికుడి మెరుపులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులంతా ఇప్పుడు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. శనివారం ఉప్పల్‌ స్టేడియం వేదికగా జరిగే మెస్సీ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌కోసం ఇప్పటికే టిక్కెట్లన్నీ దాదాపు అమ్ముడయ్యాయన్నది నిర్వాహకుల మాట. మెస్సీ ఆటను దగ్గరుండి చూడడమే గాకుండా అతడిని స్వయంగా కలిసి ఫొటోలు దిగే అవకాశం కూడా అభిమానులకు ఉంది. అయితే, అందుకు భారీగా వెచ్చించాల్సి ఉంటుంది.

మీట్‌ అండ్‌ గ్రీట్‌..

మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం కింద అభిమానులతో మెస్సీ ముచ్చటించే కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకుగాను ఒక్కో అభిమానికి రూ. 9.95 లక్షలుగా ధర నిర్ణయించారు. దీనికి జీఎస్టీ అదనం. అంటే.. మెస్సీతో ఫొటో దిగాలంటే దాదాపు రూ. 12 లక్షల దాకా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫొటోతో పాటు మెస్సీ సంతకం చేసిన అర్జెంటీనా జట్టు జెర్సీని కూడా అందజేస్తారు.

ఇవీ చదవండి:

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.. నెం.2గా కోహ్లీ

నా ఇన్‌స్టాలో బుమ్రా కనిపించాలంటే..!.. అర్ష్‌దీప్ సింగ్ వ్యాఖ్యలు వైరల్

Updated Date - Dec 11 , 2025 | 06:14 AM