Share News

Asia Junior Boxing Championship: సెమీస్‌లో బాక్సర్లు ఖుషీ, తికమ్‌

ABN , Publish Date - Apr 26 , 2025 | 03:28 AM

భారత బాక్సర్లు ఖుషీ చాంద్‌, తికమ్‌ సింగ్‌ ఆసియా జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు.మిగతా భారత బాక్సర్లు కూడా తమ విభాగాలలో సెమీస్‌ చేరుకున్నారు

Asia Junior Boxing Championship: సెమీస్‌లో బాక్సర్లు ఖుషీ, తికమ్‌

అమ్మాన్‌ (జోర్డాన్‌): ఆసియా జూనియర్‌ చాంపియన్‌షి్‌పలో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. బాలికల అండర్‌-17 విభాగంలో ఖుషీ చాంద్‌, బాలుర అండర్‌-17 కేటగిరిలో తికమ్‌ సింగ్‌ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. 46 కిలోల విభాగం క్వార్టర్స్‌లో గుయెన్‌ తి హాంగ్‌ ఎన్‌ (వియత్నాం)పై ఖుషి, ఓత్‌మన్‌ దియాబ్‌ (పాలస్తీనా)పై తికమ్‌ విజయం సాధించారు. వీరితో పాటు మిగతా భారత బాక్సర్లలో బాలుర విభాగం నుంచి అంబేకర్‌ మీటీ (48 కిలోలు), ఉద్ధమ్‌ సింగ్‌ (54 కి), రాహుల్‌ గారియా (57కి), అమన్‌ దేవ్‌ (50 కి).. బాలికల్లో జియా (48 కి), జన్నత్‌ (54 కి) కూడా సెమీ్‌సలో ప్రవేశించారు.

Updated Date - Apr 26 , 2025 | 03:28 AM