Share News

Kuldeep Yadav: పెళ్లికి రెడీ అవుతున్న కుల్దీప్ యాదవ్.. అతడికి కాబోయే భార్య ఎవరంటే..

ABN , Publish Date - Jun 04 , 2025 | 09:06 PM

టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పెళ్లికి రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన వంశికను వివాహం చేసుకోబోతున్నాడు. తాజాగా వీరి నిశ్చితార్థ కార్యక్రమం ఘనంగా జరిగింది.

Kuldeep Yadav: పెళ్లికి రెడీ అవుతున్న కుల్దీప్ యాదవ్.. అతడికి కాబోయే భార్య ఎవరంటే..
Kuldeep Yadav Engagement

టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) పెళ్లికి రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన వంశికను వివాహం చేసుకోబోతున్నాడు. తాజాగా వీరి నిశ్చితార్థ కార్యక్రమం ఘనంగా జరిగింది. లఖ్‌నవూలో కొద్ది మంది బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు (Kuldeep Yadav Engagement).


ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ‌లో శ్యామ్‌నగర్‌లో నివాసం ఉంటున్న వంశిక ఎల్‌ఐసీలో పని చేస్తున్నారు. వంశిక చిన్ననాటి నుంచి కుల్దీప్‌నకు స్నేహితురాలు. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే వీరి వివాహం ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

kuldeep2.jpg


ఇంగ్లండ్‌లో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు కుల్దీప్ ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో ఆ సిరీస్‌కు వెళ్లే ముందే నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ ఏడాదిలోనే వివాహం ఉండబోతున్నట్టు సమాచారం. కాగా, కుల్దీప్ నిశ్చితార్థానికి క్రికెటర్ రింకూ సింగ్ హాజరైనట్టు తెలుస్తోంది. కాగా, రింకూ సింగ్‌కు కూడా ఇటీవలె వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి..

Virat Kohli: నిన్ను ముద్దాడడం కోసం 18 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నా: విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్

IPL Final 2025: నెరవేరిన 18 ఏళ్ల కల.. ఈ సారి కప్పు ఆర్సీబీదే.. పంజాబ్‌పై గెలుపు


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 04 , 2025 | 09:06 PM