Share News

King Charles with Shubman Gill: కింగ్ ఛార్లెస్ ఆసక్తికర ప్రశ్న.. శుభ్‌మన్ గిల్ ఏం చెప్పాడంటే..

ABN , Publish Date - Jul 16 , 2025 | 07:17 AM

ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత పరుషుల, మహిళల జట్ల ఆటగాళ్లు బ్రిటన్ రాజు ఛార్లెస్-3ని మర్యాదపూర్వకంగా కలిశారు. క్లారెన్స్‌ హౌస్‌ గార్డెన్‌లో మంగళవారం ఇరు జట్ల ఆటగాళ్లు ఆయనతో కలిసి గ్రూప్‌ ఫొటో దిగారు. ఈ సందర్భంగా ఆయన పలువురు ఆటగాళ్లతో సరదాగా ముచ్చటించారు.

King Charles with Shubman Gill: కింగ్ ఛార్లెస్ ఆసక్తికర ప్రశ్న.. శుభ్‌మన్ గిల్ ఏం చెప్పాడంటే..
King Charles with Shubman Gill

ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత పరుషుల, మహిళల జట్ల ఆటగాళ్లు బ్రిటన్ రాజు ఛార్లెస్-3 (King Charles III)ని మర్యాదపూర్వకంగా కలిశారు. క్లారెన్స్‌ హౌస్‌ గార్డెన్‌లో మంగళవారం ఇరు జట్ల ఆటగాళ్లు (Indian Cricketers) ఆయనతో కలిసి గ్రూప్‌ ఫొటో దిగారు. ఈ సందర్భంగా ఆయన పలువురు ఆటగాళ్లతో సరదాగా ముచ్చటించారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, పేసర్ జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌‌దీప్, ప్రసిద్ధ్ తదితర ఆటగాళ్లతో మాట్లాడారు. ఇక, తాజాగా లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ హైలెట్స్ తాను చూసినట్టు ఆటగాళ్లకు కింగ్ చెప్పారు (Lords Test Match).


ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌‌ (Shubman Gill)ను గేమ్ గురించి ప్రశ్నించారు. 'మ్యాచ్‌లో చివరి బ్యాటర్ అలా దురదృష్టవశాత్తూ అవుట్ కావడం ఎలా అనిపించిందని గిల్‌'ను అడిగారు. కింగ్ ప్రశ్నకు గిల్ స్పందిస్తూ.. అది చాలా దురదృష్టకరమని, తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో రాణిస్తామని భావిస్తున్నామని బదులిచ్చాడు. అలాగే భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌తో కూడా కింగ్ మాట్లాడారు. కింగ్ ఎంతో స్నేహపూర్వకంగా సంభాషించారని హర్మన్ ప్రీత్ పేర్కొంది.


లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీ బ్రేక్ తర్వాత స్పిన్నర్‌ బషీర్‌ వేసిన బంతిని సిరాజ్ బ్యాక్‌ఫుట్‌తో డిఫెన్స్ ఆడాడు. కింద పడిన బంతి సిరాజ్ ప్యాడ్స్‌ పక్కనుంచి వెళ్లి లెగ్‌ స్టంప్‌ను తాకింది. సిరాజ్‌ గమనించేలోపే బెయిల్స్‌ కూడా కిందపడిపోయాయి. దీంతో సిరాజ్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు, ఫ్యాన్స్ సంబరాలు మిన్నంటాయి. సిరాజ్ దురదృష్టవశాత్తూ అవుట్ కాకుండా ఉండుంటే ఫలితం మరోలా ఉండేదేమో.


ఇవీ చదవండి:

లార్డ్స్ బాల్కనీలో గంగూలీ సంబరాలు.. జోఫ్రా ఆర్చర్‌కు ఎలా స్ఫూర్తినిచ్చాయంటే..

ఎంత పని చేశావ్ ఆర్చర్?

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 16 , 2025 | 07:17 AM