3 నెలలు 94 మ్యాచ్‌లు
ABN , Publish Date - Apr 29 , 2025 | 05:00 AM
ప్రపంచ క్రికెట్‌లో అగ్రశ్రేణి లీగ్‌గా కొనసాగుతున్న ఐపీఎల్‌ను మరింతగా విస్తరించే దిశగా కసరత్తు జరుగుతోంది. దీనిలో భాగంగా మ్యాచ్‌ల సంఖ్య, టోర్నీ కాలపరిమితిని....

2028 నుంచి ఐపీఎల్ విస్తరణ యోచన
న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌లో అగ్రశ్రేణి లీగ్‌గా కొనసాగుతున్న ఐపీఎల్‌ను మరింతగా విస్తరించే దిశగా కసరత్తు జరుగుతోంది. దీనిలో భాగంగా మ్యాచ్‌ల సంఖ్య, టోర్నీ కాలపరిమితిని పెంచే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం లీగ్‌లో 74 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అయితే 2028 నుంచి ఈ సంఖ్య 94కు పెంచి, మూడు మాసాలపాటు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధూమల్ పేర్కొన్నాడు. తాజా మీడియా హక్కుల కాలపరిమితి 2027 వరకు ఉంది. ఆ తర్వాతి ఏడాది నుంచి జరిగే సైకిల్‌తో ప్రారంభించి మరో 20 మ్యాచ్‌లను పెంచేందుకు అవకాశం ఉందని ధూమల్ అన్నాడు. ‘ఇదే విషయమై ఐసీసీలో చర్చిస్తున్నాం. అలాగే బీసీసీఐలోనూ అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఈ ఏడాది మ్యాచ్‌లను పెంచే ఆలోచన చేయలేదు. కానీ సమీప భవిష్యత్‌లో నిర్ణయం తీసుకుంటాం’ అని ధూమల్ వివరించాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..