Share News

అరవింద్‌కు రెండో స్థానం

ABN , Publish Date - Apr 29 , 2025 | 04:51 AM

గ్రాండ్‌ ప్రీ చెస్‌ ర్యాపిడ్‌ విభాగంలో భారత గ్రాండ్‌ మాస్టర్‌ అరవింద్‌ చిదంబరం రెండో స్థానంలో నిలిచాడు. సోమవారం జరిగిన ఆఖరి మూడు రౌండ్లలో రెండు నెగ్గిన అరవింద్‌...

అరవింద్‌కు రెండో స్థానం

వార్సా: గ్రాండ్‌ ప్రీ చెస్‌ ర్యాపిడ్‌ విభాగంలో భారత గ్రాండ్‌ మాస్టర్‌ అరవింద్‌ చిదంబరం రెండో స్థానంలో నిలిచాడు. సోమవారం జరిగిన ఆఖరి మూడు రౌండ్లలో రెండు నెగ్గిన అరవింద్‌.. ఓ గేమ్‌లో పరాజయం పాలయ్యాడు. దీంతో మొత్తం 9 రౌండ్ల నుంచి 11 పాయింట్లతో రెండో స్థానం దక్కించుకొన్నాడు. కాగా, వ్లాదిమిర్‌ ఫెడోసివ్‌ (స్లొవేనియా) కూడా 11 పాయింట్లే సాధించినా.. మెరుగైన టైబ్రేక్‌ స్కోరుతో అగ్రస్థానాన్ని చేజిక్కించుకొన్నాడు. మరో భారత జీఎం ప్రజ్ఞానంద 10 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 29 , 2025 | 05:14 AM