Ind vs Pak: మన దేశంలో ఏం జరిగిందో ఐసీసీకి కూడా తెలిసే ఉంటుంది.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లపై బీసీసీఐ స్పందన
ABN , Publish Date - Apr 24 , 2025 | 06:05 PM
ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కూడా పాకిస్తాన్‌కు టీమిండియా వెళ్లలేదు. అయితే భారత్, పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మాత్రం అప్పుడప్పుడు రెండు టీమ్‌ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాలని వ్యాఖ్యానిస్తుంటారు. అలాంటి వారికి పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది.

భారత్, పాకిస్తాన్ (Pakistan) క్రికెట్ మ్యాచ్‌లకు ఉండే ఆదరణే వేరుగా ఉంటుంది. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో 2012 నుంచి భారత్-పాక్ (Ind vs Pak) మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ ఈవెంట్లలో తటస్థ వేదికల పైనే రెండు జట్లు తలపడుతున్నాయి. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కూడా పాకిస్తాన్‌కు టీమిండియా వెళ్లలేదు. అయితే భారత్, పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మాత్రం అప్పుడప్పుడు రెండు టీమ్‌ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాలని వ్యాఖ్యానిస్తుంటారు. అలాంటి వారికి పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ (BCCI) స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది.
పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తలో ఎప్పుడూ పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేది లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. ఈ విషయంపై ఐసీసీ కూడా ఆలోచన చేయాలని రాజీవ్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. *ఉగ్రదాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. కేంద్ర ప్రభుత్వం ఏది చెబితే అదే చేస్తాం. ఇకపై పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేది లేదు* అని రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.
ఐసీసీ ఈవెంట్ల విషయానికి వచ్చే సరికి ఐసీసీ నియమాలను గౌరవిస్తూ తటస్థ వేదికల్లో పాకిస్తాన్‌తో ఆడుతున్నామని, అయితే మన దేశంలో తాజాగా జరిగిన ఘటనపై ఐసీసీకి అవగాహన ఉందని అనుకుంటున్నానని రాజీవ్ శుక్లా వ్యాఖ్యానించారు. కాగా, పహల్గాం ఉగ్రదాటి ఘటనను ఎంతో మంది క్రికెటర్లు ఖండించారు. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల ఆటగాళ్లు మౌనం పాటించారు. అలాగే చేతులకు నల్ల రిబ్బన్లు కట్టుకుని మ్యాచ్ ఆడారు.
ఇవి కూడా చదవండి..
IPL 2025 RCB vs RR: సంజూ శాంసన్ డౌటేనా.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే
IPL 2025 RCB vs RR: రాయల్స్ ఫైట్.. స్వంతమైదానంలో ఆర్సీబీకి సవాల్.. గెలుస్తారా
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..