Toss Loss Streak: టాస్...మరోసారి
ABN , Publish Date - Aug 01 , 2025 | 06:13 AM
టాస్‌లు ఓడడంలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. కెప్టెన్‌గా గిల్ వరుసగా ఐదో టాస్ ఓడగా.. గత జనవరి నుంచి అన్ని

టాస్‌లు ఓడడంలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. కెప్టెన్‌గా గిల్ వరుసగా ఐదో టాస్ ఓడగా.. గత జనవరి నుంచి అన్ని ఫార్మాట్లలో టీమిండియా వరుసగా 15వ సారి టాస్ చేజార్చుకొంది. 1999 ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య వెస్టిండీస్ వరుసగా 12 టాస్‌లు ఓడింది. ఆ రికార్డును భారత్ అధిగమించింది.
హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఈ ఆఖరి టెస్టు ఆడడం ద్వారా అరుదైన ఘనతను అందుకున్నాడు. విదేశాల్లో జరిగిన ఐదు టెస్టుల సిరీ్‌సలోని అన్ని టెస్టులనూ మూడుసార్లు ఆడడమేగాక, ఆడిన ప్రతిసారీ పదేసి వికెట్లను పడగొట్టాడు. ఈ ఘనతను అంతకుముందు కపిల్‌దేవ్, వినూమన్కడ్ మాత్రమే సాధించారు.