Share News

Junior Hockey World Cup: భారత కుర్రాళ్లకు కాంస్యం

ABN , Publish Date - Dec 11 , 2025 | 06:12 AM

సొంతగడ్డపై జరిగిన జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌లో ఫైనల్‌ చేరడంలో విఫలమైన భారత యువ జట్టు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. బుధవారం జరిగిన మూడో స్థానం పోరులో...

Junior Hockey World Cup: భారత కుర్రాళ్లకు కాంస్యం

  • అర్జెంటీనాపై విజయం

  • జూనియర్‌ హాకీ విజేత జర్మనీ

చెన్నై: సొంతగడ్డపై జరిగిన జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌లో ఫైనల్‌ చేరడంలో విఫలమైన భారత యువ జట్టు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. బుధవారం జరిగిన మూడో స్థానం పోరులో భారత్‌ 4-2తో అర్జెంటీనాను చిత్తుచేసి కంచు మోత మోగించింది. అంకిత్‌ పాల్‌ (49వ నిమిషంలో), మన్మీత్‌ సింగ్‌ (52వ), శారదానంద తివారి (57వ), అన్మోల్‌ ఎక్కా (58వ) తలో గోల్‌ సాధించారు. అర్జెంటీనా తరఫున రోడ్రిగెజ్‌ (3వ), ఫెర్నాండెజ్‌ (44వ) చెరో గోల్‌ కొట్టారు. కాగా.. 2016లో ఈ టోర్నీ విజేతగా నిలిచిన యువ భారత్‌.. గత రెండు సార్లు పోడియం ఫినిష్‌ కూడా చేయలేకపోయింది. ఇక జర్మనీ జట్టు ప్రపంచ విజేతగా నిలిచింది. ఫైనల్లో జర్మనీ పెనాల్టీ షూటౌట్‌లో 3-2తో స్పెయిన్‌ను ఓడించి 8వసారి ట్రోఫీ గెల్చుకుంది.

ఇవీ చదవండి:

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.. నెం.2గా కోహ్లీ

నా ఇన్‌స్టాలో బుమ్రా కనిపించాలంటే..!.. అర్ష్‌దీప్ సింగ్ వ్యాఖ్యలు వైరల్

Updated Date - Dec 11 , 2025 | 06:12 AM