Share News

హ్యాట్రిక్‌ టైటిళ్లతో భారత్‌ చరిత్ర

ABN , Publish Date - Jun 27 , 2025 | 06:08 AM

ఆసియా స్క్వాష్‌ డబుల్స్‌ చాంపియన్‌షి్‌ప్సలో భారత్‌ మూడు టైటిళ్లతో క్లీన్‌స్వీ్‌ప చేసి చరిత్ర సృష్టించింది. పురుషుల, మహిళల డబుల్స్‌తోపాటు మిక్స్‌డ్‌ విభాగంలోనూ..

హ్యాట్రిక్‌ టైటిళ్లతో భారత్‌ చరిత్ర

ఆసియా స్క్వాష్‌ డబుల్స్‌ చాంపియన్‌షి్‌ప్స

కౌలాలంపూర్‌: ఆసియా స్క్వాష్‌ డబుల్స్‌ చాంపియన్‌షి్‌ప్సలో భారత్‌ మూడు టైటిళ్లతో క్లీన్‌స్వీ్‌ప చేసి చరిత్ర సృష్టించింది. పురుషుల, మహిళల డబుల్స్‌తోపాటు మిక్స్‌డ్‌ విభాగంలోనూ భారత్‌ జయభేరి మోగించింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో అభయ్‌ సింగ్‌-వెలవన్‌ జోడీ 9-11, 11-5, 11-5తో పాకిస్థాన్‌కు చెందిన నూర్‌-నాసిర్‌పై గెలిచింది. మహిళల డబుల్స్‌ తుది పోరులో జోష్న చినప్ప-అనాహత్‌ సింగ్‌ జంట 8-11, 11-9, 11-10తో మలేసియాకు చెందిన ఐన్నా అమానీ-జిన్‌ యింగ్‌పై, మిక్స్‌డ్‌లో అభయ్‌-అనాహత్‌ సింగ్‌ జోడీ 11-9, 11-7తో మలేసియా జంట రేచల్‌ అర్నాల్డ్‌-అమీషన్‌రాజ్‌ చంద్రన్‌పై విజయం సాధించాయి. దీంతో అభయ్‌, అనాహత్‌ డబుల్‌ టైటిల్స్‌ సాధించినట్టయింది.

ఇవీ చదవండి:

ప్లీజ్.. ఆ పని మాత్రం చేయకు

అనుకున్నంత పని చేశారుగా

బుమ్రా గాలి తీసిన సంజన

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 27 , 2025 | 06:08 AM