WCL 2025: వైదొలిగిన భారత్.. ప్రపంచ ఛాంపియన్స్ లెజెండ్స్ ఫైనల్‌కు పాకిస్థాన్
ABN , Publish Date - Jul 30 , 2025 | 08:56 PM
బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఈ నెల 31వ తేదీన భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య సెమీ-ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఇటీవల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ మ్యాచ్ ఆడేందుకు భారత్ నిరాకరించింది. దీంతో టోర్నీ నుంచి భారత జట్టు వైదొలగగా, పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంది.

ప్రపంచ ఛాంపియన్స్ లెజెండ్స్ (WCL 2025) టోర్నీ నుంచి భారత జట్టు వైదొలిగింది. పాకిస్థాన్‌లో సెమీ-ఫైనల్ ఆడేందుకు భారత జట్టు నిరాకరించింది. దీంతో టోర్నీ నుంచి భారత జట్టు వైదొలగగా, పాకిస్థాన్ (Pakistan) ఫైనల్‌కు చేరుకుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఈ నెల 31వ తేదీన భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య సెమీ-ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఇటీవల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ మ్యాచ్ ఆడేందుకు భారత్ నిరాకరించింది (Ind vs Pak).
ఈ నిర్ణయంతో ఈ టోర్నీ నుంచి భారత్ అధికారికంగా నిష్క్రమించినట్టైంది. దీంతో పాకిస్థాన్ జట్టు నేరుగా ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధించింది. లీగ్ దశలో కూడా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. సెమీస్‌లో భారత్ ఆడకూడదని నిర్ణయించుకుంది కాబట్టి పాకిస్థాన్‌కు మార్గం సుగమం అయింది. యువరాజ్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు తన చివరి లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. దీంతో తొలి స్థానంలో ఉన్న పాకిస్థాన్‌తో సెమీ-ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది.
మరో సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడబోతున్నాయి. ఆ మ్యాచ్‌లో గెలిచే జట్టు ఆగస్ట్ రెండో తేదీన ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడబోతోంది. కాగా, పాకిస్థాన్‌తో భారత జట్టు సెమీస్ మ్యాచ్ ఆడుతుందని మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే భారత్-పాక్ మ్యాచ్ స్పాన్సర్‌షిప్ నుంచి వైదొలుగుతున్నట్టు ఈజ్ మై ట్రిప్ వ్యవస్థాపకుడు నిషాంత్ పిట్టి సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. క్రికెట్, టెర్రరిజం కలిసి ప్రయాణించలేవని కామెంట్ చేశారు. తాజాగా పాక్‌తో ఆడకూడదని భారత ఆటగాళ్లు నిర్ణయించుకున్నారు.
ఇవి కూడా చదవండి..
మాకు నువ్వేం చెప్పనక్కర్లేదు.. పిచ్ క్యూరేటర్‌తో గంభీర్ వాగ్వాదం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..