Share News

Ind vs Pak: భారత్-పాక్ మ్యాచ్.. దుబాయ్‌లో నారా లోకేష్, సుకుమార్.. !

ABN , Publish Date - Feb 23 , 2025 | 07:48 PM

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. కొన్ని కోట్ల మంది టీవీ సెట్ల ముందు కూర్చుని ఈ మ్యాచ్‌ను వీక్షిస్తారు. ఈ మ్యాచ్‌ను సామాన్య క్రికెట్ ప్రేమికులే కాదు.. సెలబ్రిటీల సైతం ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు.

Ind vs Pak: భారత్-పాక్ మ్యాచ్.. దుబాయ్‌లో నారా లోకేష్, సుకుమార్.. !
Nara Lokesh, sukumar

భారత్-పాకిస్తాన్ (Ind vs Pak) మ్యాచ్ అంటే ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. కొన్ని కోట్ల మంది టీవీ సెట్ల ముందు కూర్చుని ఈ మ్యాచ్‌ను వీక్షిస్తారు. ఈ మ్యాచ్‌ను సామాన్య క్రికెట్ ప్రేమికులే కాదు.. సెలబ్రిటీల సైతం ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. కొందరు నేరుగా స్టేడియంకు వెళ్లి వీక్షిస్తుండగా, మరికొందరు టీవీల ద్వారా చూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దుబాయ్ స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా దుబాయ్‌లోని స్టేడియంలో కనిపించారు.


మంత్రి నారా లోకేష్‌తో పాటు ఇటీవల ``పుష్ప-2``తో బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్న డైరెక్టర్ సుకుమార్, ఏపీ క్రికెట్ అసోషియేన్ అధ్యక్షుడు, ఎంపీ కేశనాని చిన్ని కూడా కనిపించారు. అలాగే బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న ఊర్వశీ రౌతేలా కూడా కనిపించింది. మరోవైపు మాజీ కెప్టెన్ ఎంస్ ధోనీ, నటుడు సన్నీ డియోల్ కలిసి టీవీలో మ్యాచ్ చూస్తున్న దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి. కాగా, ప్రస్తుతం భారత బ్యాటర్లు సాధికారికంగా ఆడుతున్నారు. (Champions Trophy).


పాకిస్తాన్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేజింగ్ చేస్తోంది. ఓపెనర్ రోహిత్ శర్మ (20) వేగంగా ఆడుతూ అవుటయ్యాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (35 నాటౌట్) మాత్రం చక్కని బౌండరీలతో అలరిస్తున్నాడు. గిల్‌కు తోడుగా కోహ్లీ (9 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా 11 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 67 పరుగులు చేసింది. భారత్ గెలవాలంటే 39 ఓవర్లలో 175 పరుగులు చేయాలి.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 23 , 2025 | 07:48 PM