KL Rahul: రాహుల్‌ను రెచ్చగొడుతున్నారు.. చప్పట్లు కొడుతూ కవ్వించిన ఇంగ్లండ్ ప్లేయర్స్..
ABN , Publish Date - Jul 14 , 2025 | 11:08 AM
భారత్, ఇంగ్లండ్ జట్లు మూడో టెస్ట్ మ్యాచ్‌ను చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. మూడో రోజు చివరి ఓవర్ సమయంలో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీ సమయం వృథా చేయడానికి ప్రయత్నించడంతో టీమిండియా ఆటగాళ్లు గట్టిగా స్పందించారు.

ఇంగ్లండ్‌లోని లార్డ్స్ (Lords Stadium) వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే చెరో టెస్ట్ మ్యాచ్ గెలిచి సమానంగా ఉన్న భారత్, ఇంగ్లండ్ జట్లు మూడో టెస్ట్ మ్యాచ్‌ను చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి (Ind vs Eng third Test ). ఈ నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. మూడో రోజు చివరి ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీ సమయం వృథా చేయడానికి ప్రయత్నించడంతో టీమిండియా ఆటగాళ్లు గట్టిగా స్పందించారు.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill)తో సహా పలువురు ఆటగాళ్లు క్రీజులో ఉన్న క్రాలీ చుట్టూ చేరి చప్పట్లు కొట్టి వ్యంగ్యంగా స్పందించారు. దీంతో నాలుగో రోజు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) పగ తీర్చుకున్నాడు. టీమిండియా బ్యాటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇంగ్లండ్ అభిమానులు మైదానంలో చప్పట్లు కొడుతూ, కేకలు వేస్తూ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. మైదానంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా అదే ప్రయత్నం చేశారు. చివర్లో నైట్ వాచ్‌మెన్‌గా వచ్చిన ఆకాష్ దీప్ వైద్య సహాయం తీసుకున్న సమయంలో బెన్ స్టోక్స్ తీవ్రంగా స్పందించాడు.
నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ (KL Rahul) దగ్గరకు వచ్చిన బెన్ స్టోక్స్ చప్పట్లు కొడుతూ ఏదో మాట్లాడాడు. ఆ క్రమంలో రాహుల్, స్టోక్స్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత చివరి ఓవర్లో ఆకాష్ దీప్‌ను స్టోక్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో స్టోక్స్ కాస్త శ్రుతి మించి సంబరాలు చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే టీమిండియా మరో 135 పరుగులు చేయాలి. ఈ నేపథ్యంలో సోమవారం ఆట మరింత రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
ఇవీ చదవండి:
రహానె ప్లానింగ్ మామూలుగా లేదుగా!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి