Share News

KL Rahul: లార్డ్స్‌లో కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు.. ఆ ఘనత సాధించిన తొలి ఓపెనర్..

ABN , Publish Date - Jul 12 , 2025 | 07:43 PM

లండన్‌లోని లార్డ్స్ మైదానాన్ని క్రికెట్‌కు పుట్టినిల్లుగా అభివర్ణిస్తుంటారు. అత్యంత పురాతనమైన ఈ స్టేడియంలో మెరుగైన ప్రదర్శన చేయడాన్ని క్రికెటర్లందరూ ఓ గౌరవంగా భావిస్తుంటారు. ప్రస్తుతం ఈ మైదానంలోనే భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది.

KL Rahul: లార్డ్స్‌లో కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు.. ఆ ఘనత సాధించిన తొలి ఓపెనర్..
KL Rahul

లండన్‌లోని లార్డ్స్ మైదానాన్ని (Lords Stadium) క్రికెట్‌కు పుట్టినిల్లుగా అభివర్ణిస్తుంటారు. అత్యంత పురాతనమైన ఈ స్టేడియంలో మెరుగైన ప్రదర్శన చేయడాన్ని క్రికెటర్లందరూ ఓ గౌరవంగా భావిస్తుంటారు. ప్రస్తుతం ఈ మైదానంలోనే భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది (Ind vs Eng). ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 176 బంతులు ఆడిన రాహుల్ 100 పరుగులు చేసి ఔటయ్యాడు (KL Rahul Record).


ఈ సెంచరీతో కేఎల్ రాహుల్ పలు అరుదైన ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు. లార్డ్స్ మైదానంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన నాలుగో విదేశీ ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. 2021లో లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కూడా రాహుల్ (129 పరుగులు) సెంచరీ నమోదు చేశాడు. ఈ రోజు లార్డ్స్ మైదానంలో రెండో సెంచరీ సాధించాడు. రాహుల్ కంటే ముందు లార్డ్స్ మైదానంలో బిల్ బ్రౌన్ (ఆస్ట్రేలియా), గోర్డాన్ గ్రీనిడ్జ్ (వెస్టిండీస్‌), గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా) రెండు కంటే ఎక్కువ సెంచరీలు చేసిన పర్యాటక జట్ల ఓపెనర్లు.


అలాగే లార్డ్స్ మైదానంలో రెండు సెంచరీలు చేసిన తొలి ఆసియా జట్టు ఓపెనర్‌గా కూడా రాహుల్ రికార్డు సృష్టించాడు. జట్టు కష్టాల్లో ఉన్న దశలో ఆదుకున్న కేఎల్ రాహుల్ (100), రిషభ్ పంత్ (74) నాలుగో వికెట్‌కు 141 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం టీమిండియా 84 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 301 పరుగులతో ఆడుతోంది. రవీంద్ర జడేజా (31 నాటౌట్), నితీష్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) క్రీజులో ఉన్నారు.


ఇవీ చదవండి:

టీమిండియాకు అశ్విన్ వార్నింగ్!

ఈ ఒక్క మ్యాజిక్ జరగాల్సిందే!

చనిపోతాడని అనుకోలేదు: సిరాజ్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 12 , 2025 | 07:45 PM