Gautam Gambhir: స్వదేశానికి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. కారణం ఏంటంటే..
ABN , Publish Date - Jun 13 , 2025 | 05:07 PM
ఇంగ్లండ్‌లో ఉన్న టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా భారత్‌కు బయలుదేరినట్టు తెలుస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భారత్‌కు బయలుదేరినట్టు తెలుస్తోంది. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా ఆయన స్వదేశానికి పయనమైనట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. త్వరలో భారత్, ఇంగ్లండ్ జాతీయ జట్ల మధ్య టెస్టు సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈలోపే గంభీర్ ఇంగ్లండ్‌కు వెళ్లారు. ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో భారత జూనియర్ జట్టు మ్యాచ్ తీరుతెన్నులను దగ్గరుండి పరిశీలించేందుకు గంభీర్ ఇంగ్లండ్‌కు వెళ్లారు. ఇంతలో ఫ్యామిలీ ఎమర్జెన్సీ గురించి తెలియడంతో గంభీర్ మళ్లీ స్వదేశానికి బయలుదేరాల్సి వచ్చింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా కూడా గంభీర్ ఇలాగే మధ్యలో స్వదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో గంభీర్ బాధ్యతలను అసిస్టెంట్ కోచ్ రయాన్ నిర్వహించనున్నారు. ఇంట్రాడే స్క్వాడ్ మ్యాచ్‌లో కోచ్ బాధ్యతలు రయాన్ నిర్వహిస్తారు. బౌలింగ్ కోచ్ మోర్కెల్, బ్యాటింగ్ కోచ్ సితాన్షూ కోటక్ ఎప్పటిలాగే టీమ్‌కు అందుబాటులో ఉంటారు. ఇక వారంలోపు గంభీర్ తిరిగొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. జూన్ 20న టెస్టు సిరీస్ ప్రారంభమయ్యే నాటికి గంభీర్ టీమిండియాకు అందుబాటులో ఉంటారు.
స్టార్ బ్యాటర్లు విరాట్, రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకోవడంతో ఈసారి ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ భారత్‌కు సవాలుగా మారనుంది. అనుభవజ్ఞులైన బ్యాటర్లు లేని టీమిండియా.. ఇంగ్లండ్‌ను ఎలా ఎదుర్కొంటుందో అన్న ఆసక్తి నెలకొంది. యువ క్రీడాకారులు టీమిండియాను ముందుకు నడిపించగలరన్న ధీమా టీమిండియా మేనేజ్మెంట్లో కనిపిస్తోంది. టీమిండియా చరిత్రలో కొత్త శకం ఆరంభమైందని కూడా అభిమానులు కామెంట్ చేస్తున్నారు. లీడ్స్, బర్మింగ్‌హామ్, లండన్‌లోని లార్డ్స్, ఓవల్, మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియాల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.
టీమిండియా జట్టు ఇదీ: శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, యశశ్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరణ్ నాయర్, నితీశ్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్
ఇంగ్లాండ్ జట్టు (భారత్‌తో తొలి టెస్ట్‌కి): షోయబ్ బషీర్, జేకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, ఒల్లి పోప్, జో రూట్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోష్ టంగ్, క్రిస్ వోక్స్.
ఇవి కూడా చదవండి:
అభిమానుల నుంచి అలాంటి ప్రేమ నాకెప్పుడూ దక్కలేదు: నొవాక్ జకోవిచ్
ఓటమి తట్టుకోలేని కార్ల్సన్ రియాక్షన్‌పై గుకేశ్ స్పందన ఇదీ
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి