Share News

Ind vs Pak: పక్కకెళ్లి ఆడుకోమ్మా.. అబ్రార్‌పై ట్రోలింగ్.. పాకిస్తాన్ ఓటమిపై ట్రెండ్ అవుతున్న మీమ్స్..

ABN , Publish Date - Feb 24 , 2025 | 02:32 PM

ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంతో రసవత్తరంగా ఉంటుంది. మైదానంలో ఆటగాళ్ల మధ్యనే కాదు, ఇరు జట్ల అభిమానుల మధ్య కూడా కవ్వింపు చర్యలు సర్వ సాధారణం. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను టీమిండియా చిత్తుగా ఓడించింది.

Ind vs Pak: పక్కకెళ్లి ఆడుకోమ్మా.. అబ్రార్‌పై ట్రోలింగ్.. పాకిస్తాన్ ఓటమిపై ట్రెండ్ అవుతున్న మీమ్స్..
Memes on pakistan cricket team

ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ (Ind vs Pak) అంటే ఎంతో రసవత్తరంగా ఉంటుంది. మైదానంలో ఆటగాళ్ల మధ్యనే కాదు, ఇరు జట్ల అభిమానుల మధ్య కూడా కవ్వింపు చర్యలు సర్వ సాధారణం. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను టీమిండియా చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో రోహిత్ సేనకు సెమీస్ బెర్త్ దాదాపు ఖాయమైంది. ఈ ఓటమితో పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దాదాపు నిష్క్రమించింది. దీంతో సోషల్ మీడియాలో పాకిస్తాన్‌పై నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు (Champions Trophy).


శుభ్‌మన్ గిల్ అవుట్ కాగానే పెవిలియన్ వైపు చూపిస్తూ ``వెళ్లు.. వెళ్లు`` అని సైగ చేసిన పాక్ స్పిన్నర్ అబ్రార్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు పాకిస్తాన్ ఆరు నెలల నుంచి మొండి పట్టు పట్టింది. టోర్నీ సజావుగా సాగేందుకు నెల రోజుల పాటు ఏర్పాట్లు చేసింది. చివరకు ఆ జట్టు టోర్నీలో ఉన్నది కేవలం 5 రోజులు. 19వ తేదిన తొలి మ్యాచ్ న్యూజిలాండ్‌తో ఆడింది. 23న భారత్‌తో తలపడింది. రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి ఇంటి దారి పట్టింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌పై ట్రెండ్ అవుతున్న మీమ్స్‌ను పరిశీలిద్దాం..


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 24 , 2025 | 02:32 PM