Asia Cricket Council: ఆసియా కప్ వేదికలివే
ABN , Publish Date - Aug 03 , 2025 | 05:59 AM
ఆసియా కప్ టీ20 టోర్నీ వేదికలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) శనివారం ప్రకటించింది. సెప్టెంబరు తొమ్మిది నుంచి 28 వరకు దుబాయ్, అబుధాబి వేదికలుగా...

దుబాయ్: ఆసియా కప్ టీ20 టోర్నీ వేదికలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) శనివారం ప్రకటించింది. సెప్టెంబరు తొమ్మిది నుంచి 28 వరకు దుబాయ్, అబుధాబి వేదికలుగా టోర్నీ నిర్వహించనున్నట్టు తెలిపింది. సెప్టెంబరు 14న భారత్-పాకిస్థాన్ గ్రూపు దశ మ్యాచ్ దుబాయ్‌లో జరగనుంది. అఫ్ఘానిస్థాన్-హాంకాంగ్ జట్ల ప్రారంభ మ్యాచ్‌కు అబుధాబి ఆతిథ్యమివ్వనుంది. ఇక..ఫైనల్‌ను దుబాయ్‌లో నిర్వహిస్తారు. సెప్టెంబరు 10న తమ ప్రారంభ మ్యాచ్‌లో యూఏఈతో దుబాయ్‌లో టీమిండియా తలపడనుంది.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి