కార్ల్‌సన్‌కు చెమటలు పట్టించాడు
ABN , Publish Date - Jun 26 , 2025 | 06:03 AM
ఐదుసార్లు వరల్డ్ చాంపియన్, నార్వే దిగ్గజ గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు తొమ్మిదేళ్ల చిన్నోడు ఆరిత్ కపిల్ చెమటలు పట్టించాడు. ‘ఎర్లీ టైటిల్ ట్యూస్‌డే’ అనే...

9 ఏళ్ల పిల్లోడు
న్యూఢిల్లీ: ఐదుసార్లు వరల్డ్ చాంపియన్, నార్వే దిగ్గజ గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు తొమ్మిదేళ్ల చిన్నోడు ఆరిత్ కపిల్ చెమటలు పట్టించాడు. ‘ఎర్లీ టైటిల్ ట్యూస్‌డే’ అనే ఆన్‌లైన్ టోర్నీలో బుధవారం వీరిరువురూ తలపడ్డారు. నిర్ణీత సమయం ముగియడానికి వేసిన రెండు ఎత్తుల ముందు వరకు కార్ల్‌సన్‌పై కపిల్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. అయితే సమయం ముగియడంతో కపిల్ తప్పని పరిస్థితుల్లో డ్రాకు అంగీకరించాడు. ప్రస్తుతం జార్జియాలో అండర్-10 వరల్డ్ చాంపియన్‌షి్‌పలో ఆడుతున్న కపిల్ అక్కడ బస చేస్తున్న హోటల్ గది నుంచే కార్ల్‌సన్‌తో ఈ టోర్నీలో ఆడాడు. చెస్ ప్రపంచంలో కార్ల్‌సన్-కపిల్ మధ్య జరిగిన ఈ పోటీ చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది భువనేశ్వర్‌లో జరిగిన ఒక చెస్ టోర్నీలో ఉజ్బెకిస్థాన్ జీఎం రాసెట్ జియాటిడినోవ్‌పై అద్భుత విజయానంతరం కపిల్ పేరు మార్మోగిపోయింది.
ఇవీ చదవండి:
రిషభ్ పంత్ సెంచరీ చేస్తే అదే జరుగుతుందా.. టీమిండియా ఓటమికి అతడే కారణమా..
బుమ్రా రెండో టెస్ట్ ఆడతాడా.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఏం చెప్పాడంటే..
శుభ్‌మన్ గిల్ చెత్త రికార్డు.. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే టీమిండియా ఓటమి ఎలాంటిదంటే..
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి