Worlds Largest Lips: యువతి పిచ్చి పీక్స్.. పెదాలకోసం 21 లక్షలు ఖర్చు పెట్టింది..
ABN , Publish Date - Aug 03 , 2025 | 09:44 PM
Worlds Largest Lips: ఆండ్రియా కేవలం లిప్ పిల్లర్లు చేయించుకోవడానికి ఏకంగా 21 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. పెదాలు చాలా పెద్దవిగా మారిపోయాయి. ప్రపంచంలోనే అత్యంత పెద్దవైన పెదాలు కలిగిన మహిళగా రికార్డు సృష్టించింది.

‘జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి’ అన్నట్లు.. మనిషికి, మనిషికి మధ్య ఆహారపు అలవాట్లలో.. ఆలోచనల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆహారపు అలవాట్లు వేరైతే పెద్దగా ఇబ్బంది లేదు. కానీ, ఆలోచనలు వేరుగా ఉంటే మాత్రం కష్టమే. కొన్ని సార్లు పరిస్థితి దారుణంగా తయారు అవుతుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ఓ యువతి పెదాలు పెద్దవిగా కనిపించాలని ఏకంగా 21 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. అలాగని ఆమె పెదాలు అందంగా ఉన్నాయా అంటే కాదు. ఆ పెదాలతో ఆమె దారుణంగా కనిపిస్తోంది.
ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బల్గేరియాకు చెందిన 27 ఏళ్ల ఆండ్రియా ఐవనోవా అనే యువతి అందంగానే ఉంటుంది. కానీ, ఏ మాయ రోగమో తెలీదు కానీ, ఇంకా అందంగా కనిపించాలన్న ఉద్దేశ్యంతో సర్జరీలు మొదలుపెట్టింది. 2018లో ముఖానికి చిన్ షేపింగ్, జా షేపింగ్, చీక్ బోన్ ఎన్‌హ్యాన్స్‌మెంట్, లిప్ పిల్లర్స్ చేయంచుకుంది. 2022 నాటికి మొత్తం 32 సర్జరీలు చేయించుకుంది. తనను తాను ఓ బొమ్మలాగా మార్చేసుకుంది. అయినా ఆమె పిచ్చి చావలేదు.
కేవలం లిప్ పిల్లర్లు చేయించుకోవడానికి ఏకంగా 21 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. పెదాలు చాలా పెద్దవిగా మారిపోయాయి. ప్రపంచంలోనే అత్యంత పెద్దవైన పెదాలు కలిగిన మహిళగా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆ పెదాలపై స్పందిస్తున్న నెటిజన్లు దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ‘అప్పుడే బాగుంది.. ఇప్పుడు దెయ్యంలా మారింది’..‘పగలు చూస్తే పగలే కల్లోకి వచ్చేలా ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక, ఆండ్రియా సర్జరీల కోసం ఇప్పటి వరకు 85 వేల డాలర్లు.. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 70 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
వేరే మతం వ్యక్తి ప్రిన్సిపల్‌గా ఉన్నాడని కుట్ర.. పిల్లాడిని రంగంలోకి దించి..
నడిరోడ్డుపై తగలబడ్డ 10 కోట్ల స్పోర్ట్స్ కారు