Share News

Ajith: అప్పులు తీర్చడానికి సినిమాల్లోకి వచ్చిన అజిత్

ABN , Publish Date - May 01 , 2025 | 07:23 PM

Hero Ajith: హీరో అజిత్ తమిళ సూపర్ అవ్వడానికి ముందు.. ఆయన కెరీర్ తెలుగు సినిమాతోటే మొదలైంది. ప్రేమ పుస్తకం సినిమాతో చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలోకి వెళ్లిపోయారు.

Ajith: అప్పులు తీర్చడానికి సినిమాల్లోకి వచ్చిన అజిత్
Hero Ajith

తమిళ సూపర్ స్టార్ అజిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమాలు తమిళంతో పాటు తెలుగులో డబ్ అయి విడుదల అవుతున్నాయి. సూపర్ హిట్లుగా నిలుస్తున్నాయి. హీరో అజిత్ తమిళ సూపర్ స్టార్ అవ్వడానికి ముందు.. ఆయన కెరీర్ తెలుగు సినిమాతోటే మొదలైంది. ప్రేమ పుస్తకం సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలోకి వెళ్లిపోయారు. అజిత్ హీరో అవ్వాలని చిత్ర పరిశ్రమలోకి రాలేదట. అది అనుకోకుండా జరిగిందట. చేసిన అప్పులు తీర్చడానికే సినిమాలు చేశారట. ఈ విషయాన్ని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు.


అజిత్ మాట్లాడుతూ.. ‘ నటన అన్నది నా ఆలోచనల్లోనే లేదు. నేను అనుకోకుండా నటుడ్ని అయ్యాను. స్కూలు అయిపోయిన వెంటనే ఓ ఆటో మొబైల్ కంపెనీలో పని చేశాను. అక్కడ అప్రెంటిస్‌గా ఆరు నెలలు పని చేశాను. 18 ఏళ్లు ఉన్నపుడు రేసింగ్ స్టార్ట్ చేశాను. రేసింగ్ ఖర్చుతో కూడుకున్న పని అవ్వటంతో మా అమ్మానాన్నలు ఆర్థికంగా నాకు మద్దతు ఇవ్వలేకపోయారు. అయినా నేను వెనక్కు తగ్గలేదు. రేసింగ్ కొనసాగించాను. ఓ రోజు నేను రేస్ ట్రాకులో ఉండగా.. మోడల్ కోఆర్డినేటర్ నా దగ్గరకు వచ్చాడు. మోడలింగ్‌లో ఆసక్తి ఉంటే తనను కలవమని కార్డు ఇచ్చాడు. రేసింగ్ కోసం డబ్బులు వస్తాయి కాబట్టి ఓకే చెప్పాను. మోడలింగ్‌లో వచ్చిన డబ్బుల్ని రేసింగ్‌ కోసం వాడేవాడిని. ఓ సారి తెలుగు సినిమా ఆడిషన్‌కు కాల్ వచ్చింది. నాకు తెలుగు రాదు.


తెలుగు నేర్చుకోవాలని డిసైడ్ అయ్యాను. మా కుటుంబానికి సినిమాలతో అస్సలు సంబంధం లేదు కాబట్టి.. మా అమ్మానాన్న భయపడ్డారు. నేను వారికి నచ్చజెప్పాను. అందివచ్చిన అవకాశాన్ని కాదనుకునేవాడు మూర్ఖుడని నేను నమ్ముతాను. ఆ కారణం వల్లే అనుకోకుండా సినిమాల్లోకి వచ్చా. ఓ వ్యాపారంలో బాగా దెబ్బతినటం వల్ల నేను సినిమాల్లోకి వచ్చాను. కేవలం అప్పులు కట్టడానికి సినిమాలు చేశాను. ఫేమస్ అవ్వాలని సినిమాల్లోకి రాలేదు. కెరీర్ మొదలైనపుడు నేను నటించిన సినిమాల్లో యాక్టింగ్ భయంకరంగా ఉంటుంది. తమిళంలో కూడా నా పాత్రలకు వేరేవాళ్లతో డబ్బింగ్ చెప్పించే వారు. నా యాస కారణంగా కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నాను. పట్టుదలతో అన్నిటిపై పట్టు సాధించాను. సినిమాల విషయంలో ఎంతో నిజాయితీగా ఉన్నాను’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

AI: అతిగా ఏఐ వాడుతున్నారా.. అయితే మీ పని మటాష్.

Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్ర దాడి.. తొలిసారి స్పందించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

Updated Date - May 01 , 2025 | 07:23 PM