Tamil Actor Srikanth: తమిళ హీరో శ్రీకాంత్ అరెస్ట్
ABN , Publish Date - Jun 23 , 2025 | 09:35 PM
Tamil Actor Srikanth: శ్రీకాంత్ 2003లో విడుదల అయిన ఒకరికి ఒకరు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2007లో విడుదలైన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ప్రముఖ తమిళ హీరో శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్‌ను అరెస్ట్ అయ్యారు. డ్రగ్స్ కేసులో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాంత్ 12 వేల రూపాయల విలువ చేసే కొకైన్ కొనుగోలు చేశారన్న ఆరోపణలు రావటంతో.. పోలీసులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. డ్రగ్స్ తీసుకున్నారని తేలటంతో సోమవారం చెన్నైలో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. తీగలాగితే డొంక కదిలినట్టు ఏఐఏడీఎమ్‌కే నేత ప్రసాద్ అరెస్ట్‌తో శ్రీకాంత్ పేరు వెలుగులోకి వచ్చింది.
కొన్ని రోజుల క్రితం నుంగబాక్కంలోని ఓ బార్‌లో గొడవ జరిగింది. ఆ గొడవకు సంబంధించిన కేసులో ప్రసాద్ అరెస్ట్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే ప్రసాద్ డ్రగ్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నట్లు తేలింది. పోలీసుల విచారణలో తాను హీరో శ్రీకాంత్‌కు డ్రగ్స్ సప్లై చేసినట్లు వెల్లడించాడు. దీంతో యాంటీ నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ శ్రీకాంత్‌ను విచారణకు పిలిచింది. ఈ సందర్భంగా ఆయనకు డ్రగ్స్ టెస్ట్ చేయించింది. టెస్టులో పాజిటివ్ రావటంతో అరెస్ట్ చేసింది.
శ్రీకాంత్ సినిమా కెరీర్ విషయానికి వస్తే..
శ్రీకాంత్ 2002లో విడుదల అయిన ‘రోజా కూటమ్’ అనే తమిళ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ సినిమా తెలుగులో ‘రోజా పూలు’ పేరుతో డబ్ అయి రిలీజైంది. 2003లో విడుదల అయిన ‘ఒకరికి ఒకరు’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2007లో విడుదలైన ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు చేశారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా సినిమాలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
జగన్ సత్తెనపల్లి పర్యటన వల్ల మరొకరు బలి
ప్రతీకారం తీర్చుకున్న ఇరాన్.. అమెరికా మిలటరీ బేస్‌లపై దాడులు..