Aryas Film Set: హీరో ఆర్య సినిమా షూటింగ్‌లో విషాదం.. ఆర్టిస్ట్ మృతి
ABN , Publish Date - Jul 14 , 2025 | 12:16 PM
Aryas Film Set: ఆదివారం ఉదయం స్టంట్ ఆర్టిస్ట్ రాజు షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కారుతో ఆయన స్టంట్ చేశారు. ఆ స్టంట్ కాస్తా ఆయన ప్రాణాలు తీసింది. రాజు మృతిపై హీరో విశాల్ స్పందించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఆదివారం మధ్యాహ్నం ఓ పోస్టు పెట్టారు.

తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ స్టంట్ ఆర్టిస్ట్ కన్నుమూశారు. షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురై చనిపోయారు. ఆదివారం ఉదయం ఈ దారుణం జరిగింది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య.. దర్శకుడు పా రంజిత్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఆదివారం ఉదయం యాక్షన్ సీన్ల చిత్రీకరణ జరుగింది. స్టంట్ ఆర్టిస్ట్ రాజు షూటింగ్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కారుతో ఆయన స్టంట్ చేశారు. ఆ స్టంట్ కాస్తా ఆయన ప్రాణాలు తీసింది. రాజు మృతిపై హీరో విశాల్ స్పందించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఆదివారం మధ్యాహ్నం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో .. ‘కారుతో స్టంట్ చేస్తుండగా స్టంట్ ఆర్టిస్ట్ రాజు చనిపోయాడు. రాజు చనిపోయాడన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. నాకు రాజు చాలా ఏళ్లనుంచి తెలుసు. నా సినిమాల్లో ఎన్నో ప్రమాదకర స్టంట్లు చేశాడు. అతడు చాలా ధైర్యం కలిగిన వ్యక్తి.
అతడి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఇలాంటి విషాదకరమైన సమయంలో దేవుడు వారికి ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఒకే చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిగా.. అతడితో కలిసి ఎన్నో చిత్రాలకు పని చేసిన వ్యక్తిగా.. నా మనస్ఫూర్తిగా అతడి కుటుంబానికి వీలైనంత సాయం చేస్తాను. అది నా బాధ్యత’ అని పేర్కొన్నారు. అయితే, ఈ విషాదంపై హీరో ఆర్య కానీ, దర్శకుడు పా రంజిత్ గానీ స్పందించలేదు. ఇకపై స్పందిస్తారేమో చూడాలి.
ఇవి కూడా చదవండి
భార్యను చంపి సమాధిపై కూరగాయలు నాటాడు.. 9 నెలల తర్వాత.
ఈ మూడు అలవాట్లు పాటిస్తే చాలు.. వృద్ధాప్యం వచ్చినా పుష్టిగా ఉంటారు.!