Share News

Samantha: సమంత టెన్త్ క్లాస్ మార్క్ షీట్ చూశారా.. ఆ ఒక్క సబ్జెక్ట్‌లో..

ABN , Publish Date - Jun 26 , 2025 | 10:00 PM

Samantha SSLC Mark Sheet: సమంత టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ మార్క్ షీట్ చూస్తే సమంత యాక్టింగ్ లోనే కాదు.. చదువులోనూ క్వీన్ అని అర్థం అయిపోతుంది.

Samantha: సమంత టెన్త్ క్లాస్ మార్క్ షీట్ చూశారా.. ఆ ఒక్క సబ్జెక్ట్‌లో..
Samantha SSLC Mark Sheet

స్మైలింగ్ క్వీన్ సమంత చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి పదేళ్లుపైనే అవుతోంది. ఈ పదేళ్లలో ఆమె సంపాదించిన పేరు, గెలుచుకున్న అవార్డులు, సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. కేవలం దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుతున్నారు. హీరోయిన్‌గానే కాకుండా నిర్మాతగా కూడా తనేంటో నిరూపించుకున్నారు. శుభం అనే సినిమాతో అదిరిపోయే హిట్ కొట్టారు. ఆ సినిమా చూస్తే నిర్మాతగా కథల ఎంపికలో ఆమె టేస్ట్ తెలిసిపోతుంది. ఇక, అనారోగ్యం కారణంగా గత కొన్నేళ్ళ నుంచి ఆమె సినిమాలు బాగా తగ్గించేశారు.


తెలుగులో చివరగా ఖుషీ సినిమాలో కనిపించారు. 2025లో తాను నిర్మాతగా తీసిన శుభం సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేశారు. కొత్త సినిమాలు కూడా ఆమె ఒప్పుకోవటం లేదు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వెబ్ సిరీస్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇక, అసలు విషయానికి వస్తే.. సమంత టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ మార్క్ షీట్ చూస్తే సమంత యాక్టింగ్ లోనే కాదు.. చదువులోనూ క్వీన్ అని అర్థం అయిపోతుంది.


100 మార్కులకు గానూ.. ఇంగ్లీష్ 1లో 90 మార్కులు, ఇంగ్లీష్ 2లో 74 మార్కులు, తమిళం 1లో 83 మార్కులు తమిళం 2లో 88 మార్కులు, మ్యాథమెటిక్స్ 1లో 100 మార్కులు, మ్యాథమెటిక్స్ 2లో 99 మార్కులు, ఫిజిక్స్‌లో 95 మార్కులు, బాటనీలో 84 మార్కులు, హిస్టరీలో 91 మార్కులు, జియోగ్రఫీలో 83 మార్కులు వచ్చాయి. వెయ్యి మార్కులకు గాను 887 మార్కులు తెచ్చుకుంది. సమంత మ్యాథమెటిక్స్‌లో 100కు 100 తెచ్చుకోవటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక, సమంత 2001 నుంచి 2002 మధ్య కాలంలో ఎస్ఎస్ఎల్‌సీ పూర్తి చేసుకుంది.

SAM.jpg


ఇవి కూడా చదవండి

వామ్మో.. భయం అంటే మీనింగే తెలియని బ్లడ్ అది.. ఎంత ప్రమాదకరంగా పని చేస్తున్నాడో చూడండి..

పబ్జీ ఆటతో మొదలైన ప్రేమ.. భర్త, కొడుకును వదిలి..

Updated Date - Jun 26 , 2025 | 10:06 PM