Share News

96 Movie Sequel: 96 సీక్వెల్‌.. క్యారెక్టర్లపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..

ABN , Publish Date - May 30 , 2025 | 07:07 PM

96 Movie Sequel: 96 సినిమా 2018 అక్టోబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. 18 కోట్లతో తీస్తే .. 50 కోట్లు రాబట్టింది. సినిమాలోని అన్ని పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది.

96 Movie Sequel: 96 సీక్వెల్‌.. క్యారెక్టర్లపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..
96 Movie Sequel

తమిళంలో సూపర్ హిట్ అయిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 96 సినిమాకు సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు ప్రేమ్ కుమార్ 96 సీక్వెల్‌కు సంబంధించిన కథకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. 96 పార్ట్ 1ను తెరకెక్కించిన నిర్మాణ సంస్థే.. పార్ట్ 2ను కూడా తీస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైపోయాయి. 96 సీక్వెల్ అనౌన్స్ చేసినప్పటినుంచి ఇప్పటి వరకు సినిమా టీమ్‌ను పుకార్లు వెంటాడి వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 96 పార్ట్ 2లో త్రిష లేదని ప్రచారం జరుగుతోంది. విజయ్ సేతుపతి స్థానంలో ప్రదీప్ రంగనాథన్ నటిస్తాడన్న పుకార్లు మొదలయ్యాయి.


ఈ పుకార్లపై దర్శకుడు ప్రేమ్ కుమార్ స్పందించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రదీప్ రంగనాథన్ పాత్రపై ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో .. ‘ ఇది కూడా ఒక ఫేక్ న్యూస్. 96 సినిమాలో ఎవరైతే నటించారో వారే 96 పార్ట్ 2లో ఉంటారు. నేను ఇంకో విషయంపై కూడా క్లారిటీ ఇస్తున్నాను. ప్రదీప్ రంగనాథన్‌ను నేను వేరే కథ కోసం కలిశాను. 96 సీక్వెల్‌తో అతడికి ఏ మాత్రం సంబంధం లేదు. ఈ ప్రమాదకరమైన ఫేక్ న్యూస్‌తో వ్యవహరించటం రోజు రోజుకు ఇబ్బందిగా మారుతోంది. నేను మళ్లీ మీడియాకు వచ్చి నిజం చెప్పాల్సి వస్తోంది’ అని అన్నారు.


ప్రేమ్ కుమార్ ఇచ్చిన క్లారిటీతో 96 సీక్వెల్‌లో త్రిష పాత్ర తప్పకుండా ఉంటుందని క్లారిటీ వచ్చింది. ఇక, 96 సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా 2018 అక్టోబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. 18 కోట్లతో తీస్తే .. 50 కోట్లు రాబట్టింది. సినిమాలోని అన్ని పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. నేపథ్య సంగీతం, పాటల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2019లో ఈ సినిమా కన్నడలో 99 గా రీమేక్ అయింది. 2020లో తెలుగులో జానుగా రీమేక్ అయింది. తెలుగులో సమంత, శర్వానంద్ జాను, రామ్‌గా నటించారు.


ఇవి కూడా చదవండి

12 మంది పాక్ ఆర్మీ జవాన్లను చంపేసిన టీటీపీ

థాయ్‌లాండ్ వెళ్లేవారికి హెచ్చరిక.. పులులతో జాగ్రత్తగా ఉండండి..

Updated Date - May 30 , 2025 | 07:07 PM