Share News

Ramya Receives Threats: హీరోయిన్‌ రమ్యకు అత్యాచార బెదిరింపులు.. ఇద్దరు అరెస్ట్..

ABN , Publish Date - Aug 02 , 2025 | 06:35 PM

Ramya Receives Threats: దర్శన్ ఫ్యాన్స్‌గా చెప్పుకున్న కొంతమంది రమ్యపై రెచ్చిపోయారు. అసభ్య కామెంట్లతో ఆమెను ఇబ్బంది పెట్టారు. చంపేస్తామని, అత్యాచారం చేస్తామని బెదిరించారు. దీంతో పోలీసులను ఆశ్రయించింది.

Ramya Receives Threats: హీరోయిన్‌ రమ్యకు అత్యాచార బెదిరింపులు.. ఇద్దరు అరెస్ట్..
Ramya Receives Threats

ప్రముఖ కన్నడ హీరోయిన్, మాజీ ఎంపీ రమ్యపై బెదిరింపులకు పాల్పడిన కేసులో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 11 మందిని గుర్తించారు. వారిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రేణుకా స్వామి మర్డర్ కేసు విషయంలో రమ్యకు, దర్శన్ ఫ్యాన్స్‌కు మధ్య గత కొన్ని నెలల నుంచి ఆన్‌లైన్ యుద్ధం నడుస్తోంది. కొన్ని రోజుల క్రితం రమ్య తన సోషల్ మీడియా ఖాతా ద్వారా రేణుకా స్వామి కేసుపై స్పందించారు. అతడి కుటుంబానికి న్యాయం జరగలేదని అన్నారు.


దర్శన్ ఫ్యాన్స్‌గా చెప్పుకున్న కొంతమంది ఆమెపై రెచ్చిపోయారు. అసభ్య కామెంట్లతో రమ్యను ఇబ్బంది పెట్టారు. చంపేస్తామని, అత్యాచారం చేస్తామని బెదిరించారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. జులై 28వ తేదీన తనపై అసభ్య కామెంట్లు చేసిన 43 సోషల్ మీడియా ఖాతాలపై కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ 13 అకౌంట్లకు చెందిన వ్యక్తులు రమ్యపై తీవ్ర కామెంట్లు చేసినట్లు గుర్తించారు. బెంగళూరు పక్క జిల్లాలకు చెందిన ఇద్దర్ని అరెస్ట్ చేశారు.


అయితే, వారు నిజంగా దర్శన్ ఫ్యాన్సా.. కాదా? అన్న దానిపై క్లారిటీ లేదు. పోలీసులు ఆ విషయంపైనా విచారణ చేస్తున్నారు. ఇక, కేసు పెట్టిన కొన్ని రోజులకే పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేయటంపై రమ్య స్పందించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో శనివారం కొన్ని స్టోరీలు పెట్టారు. ఆ స్టోరీలలో కర్ణాటక హోమ్ మినిష్టర్ జి.పరమేశ్వర, బెంగళూరు పోలీస్ కమిషనర్, సీసీబీ టీమ్ మొత్తానికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. చట్టం చేతుల నుంచి తప్పించుకోవటం కష్టమని అన్నారు.

RAMYA.jpg


ఇవి కూడా చదవండి

మీరసలు తల్లిదండ్రులేనా.. కన్న కొడుకును అలా వదిలేసి పోతారా?

మానవత్వం మరిచిన పోలీస్.. మరీ ఇంత దారుణమా..

Updated Date - Aug 02 , 2025 | 07:44 PM