Share News

Ramya Police Complaint: స్టార్ హీరో ఫ్యాన్స్‌పై హీరోయిన్ పోలీస్ కంప్లైంట్

ABN , Publish Date - Jul 28 , 2025 | 03:53 PM

Ramya Police Complaint: హీరో దర్శన్ తన ఫ్యాన్ రేణుకా స్వామి హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు. అయితే, రేణుకా స్వామి మర్డర్‌పై రమ్య మొదటి నుంచి ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు.

Ramya Police Complaint: స్టార్ హీరో ఫ్యాన్స్‌పై హీరోయిన్ పోలీస్ కంప్లైంట్
Ramya Police Complaint

శాండల్‌వుడ్ స్టార్ హీరో దర్శన్ ఫ్యాన్స్‌కు హీరోయిన్ రమ్యకు మధ్య గత కొంతకాలంగా ఆన్‌లైన్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. రెండు, మూడు రోజుల నుంచి ఆ వార్ పీక్స్‌కు చేరుకుంది. దర్శన్ ఫ్యాన్స్ ఆన్‌లైన్ వేదికగా రెచ్చిపోతున్నారు. రమ్యపై తీవ్రస్థాయిలో అసభ్య కామెంట్లు చేస్తున్నారు. వారి వేధింపులు ఎక్కువవటంతో రమ్య భరించలేకపోయారు. వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే దర్శన్ ఫ్యాన్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


అంతేకాదు.. రమ్య ఈ విషయాన్ని నేరుగా కమిషనర్‌కు వివరించడానికి సిద్ధమయ్యారు. సోమవారం స్వయంగా కమిషనర్ ఆఫీస్‌కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘బెంగళూరు కమిషనర్ నన్ను కలవడానికి ఒప్పుకున్నారు. ఈ రోజు టైం ఇచ్చారు. నేను ఆయన్ని కలవడానికి వెళుతున్నాను. నేను నా లాయర్లతో కూడా టచ్‌లో ఉన్నాను. మేము అన్ని మిసేజ్‌లను ఒక చోట చేర్చి.. వాటి ఆధారణంగా కంప్లైంట్ ఇవ్వాలని భావిస్తున్నాము. ఈ మధ్యకాలంలో ఆడాళ్లను వేధించటం సర్వ సాధారణం అయిపోయింది.


ఎవరైనా మహిళ దేని గురించైనా మాట్లాడితే.. ఆమె క్యారెక్టర్‌ను చంపేయడానికి ప్రయత్నిస్తారు. దారుణమైన కామెంట్లు చేస్తారు’ అంటూ ఆవేధన వ్యక్తం చేశారు. కాగా, హీరో దర్శన్ తన ఫ్యాన్ రేణుకా స్వామి హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు. అయితే, రేణుకా స్వామి మర్డర్‌పై రమ్య మొదటి నుంచి ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. అతడి కుటుంబానికి న్యాయం జరగాలని అంటున్నారు. ఈ విషయంలోనే రమ్యకు, దర్శన్ ఫ్యాన్స్‌కు మధ్య గొడవలు జరుగుతున్నాయి.


ఇవి కూడా చదవండి

రెచ్చిపోయిన ఎద్దు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని..

షటిల్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిన యువకుడు..

Updated Date - Jul 28 , 2025 | 04:05 PM