Share News

Common Passport Mistakes: పాస్‌పోర్టు విషయంలో ఈ తప్పులు చేస్తే చుక్కలే..

ABN , Publish Date - Apr 29 , 2025 | 07:28 AM

పాస్‌పోర్టు విషయంలో జరిగే కొన్ని పొరపాట్లు మీ టూర్ ప్రణాళికలకు చివరి నిమిషంలో ఆటంకాలు సృష్టిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Common Passport Mistakes: పాస్‌పోర్టు విషయంలో ఈ తప్పులు చేస్తే చుక్కలే..
Passport Renewal Tips

ఇంటర్నెట్ డెస్క్: ఫారిన్ టూర్లు అంటే చాలా మందికి ఇష్టం. అయితే, ఇలా విదేశాలకు వెళ్లే వాళ్లు పాస్‌పోర్టు, వీసా విషయాల్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. లేకపోతే మరో దేశంలో దిగాక ఊహించని పరిణామాలు ఎదురుకావచ్చు. ఆయా దేశాల్లోని అధికారులు మిమ్మల్ని వెనక్కు పంపించొచ్చు. మరి పాస్‌పోర్టు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

పాస్‌పోర్టు ఎక్స్‌పైరీ డేట్‌ను సరిచూసుకోకపోవడం చాలా మంది చేసే పొరపాటు. కనీసం ఆరు నెలల పాటు చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్టునే పలు దేశాలు అనుమతిస్తాయి. ఇంతకంటే తక్కువ కాలపరిమితి ఉంటే ఫారిన్ కంట్రీలోకి అనుమతి ఉండకపోవచ్చు. కాబట్టి, పాస్‌పోర్టును వీలైనంత త్వరగా రెన్యూ చేసుకోవాలి

పాస్‌పోర్టు ప్రాసెసింగ్ టైమ్స్‌పై కూడా దృష్టి పెట్టాలి. ప్రయాణానికి కనీసం 10 నుంచి 12 వారాల ముందే పాస్‌పోర్టు రెన్యూ చేసుకోవడం లేదా కొత్తదానికి అప్లై చేసుకోవడం చేస్తే ఎటువంటి ఇబ్బందీ ఉండదు.


అక్కడక్కడా చెరిగిన లేదా నీటిలో తడిసి పాడైన పాస్‌పోర్టులను కొన్ని దేశాలు అస్సలు అనుమతించవు. ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తే ఇతర దేశాలను వెళ్లాక అక్కడి అధికారులు వెనక్కు పంపించొచ్చు.

పెళ్లి, విడాకులతో పేరు మార్చుకున్నప్పుడు ఆ మేరకు పాస్‌‌పోర్టులు, ఇతర ముఖ్యపత్రాల్లో పేరు మార్పు చేయాలి. డాక్యుమెంట్స్‌లో పేరు సరిపోలని పక్షంలో చివరిని నిమిషంలో చిక్కులు తప్పవు. కాబట్టి, పాస్‌పోర్టుపై పేరు విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.

పాస్‌పోర్టుతో పాటు వీసా విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే చివరి నిమిషంలో సమస్యలు ఎదురవుతాయి.


ప్రయాణాల్లో ఒక్కోసారి పాస్‌పోర్టు, వీసా వంటి ముఖ్యమైన పత్రాలు పోయే అవకాశం ఉంది. ఈ విషయం తెలిసినా కొందరు ఈ ధ్రువపత్రాల కాపీలను వెంట తీసుకెళ్లరు. డిజిటల్ కాపీలను కూడా పెట్టుకోరు. ఇలాంటి వారు పాస్‌పోర్టు గనక పోగొట్టుకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇక ద్విపౌరసత్వం ఉన్న వారు ఒక్కోసారి తమ వెంట ఒకటికి బదులు మరో పాస్‌‌పోర్టు తీసుకెళ్లి ఇబ్బందుల్లో పడుతుంటారు. ఇలాంటి వారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ప్రయాణానికి మూడు నాలుగు వారాల ముందే అన్నీ ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకుని సిద్ధంగా ఉంటే ఫారిన్ టూర్లలో ఏ టెన్షన్ లేకుండా ఎంజాయ్ చేయొచ్చు.

ఇవి కూడా చదవండి:

సింధు నదీ జలాల ఒప్పందం నిలుపుదలపై పాక్ ప్రజలు ఏమంటున్నారంటే..

మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పులు తీర్చి.. అతడి తల్లిదండ్రుల భారం మోస్తూ..

అకస్మాత్తుగా కూలిన నాలుగు అంతస్తుల భవనం.. సీటీటీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు

Read Latest and Viral News

Updated Date - Apr 29 , 2025 | 07:28 AM