Share News

Optical Illusion Test: మీది చురుకైన చూపు అయితే.. ఈ పువ్వుల మధ్యలో ఏముందో 5 సెకెన్లలో వెతికిపెట్టండి

ABN , Publish Date - Jun 11 , 2025 | 03:11 PM

ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.

Optical Illusion Test: మీది చురుకైన చూపు అయితే.. ఈ పువ్వుల మధ్యలో ఏముందో 5 సెకెన్లలో వెతికిపెట్టండి
Optical Illusion

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.


వైరల్ అవుతున్న పై ఫొటో మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని టెస్ట్‌ చేసే పిక్చర్ పజిల్ టెస్ట్. ఆ ఫొటోలో గులాబీ రంగులో ఉన్న పువ్వులు కనబడుతున్నాయి. ఆ పువ్వుల మీద ఏదో ఉంది. నిశితంగా పరిశీలిస్తేనే అది ఏంటో మీకు కనబడుతుంది. అది ఏంటో ఎక్కడుందో కనుక్కోవడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. దానిని 5 సెకెన్ల వ్యవధిలో కనిపెడితే మీ పరిశీలనా శక్తికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేయడంలో పజిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి.


సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది. చాలా తక్కువ మంది మాత్రమే 5 సెకెన్ల వ్యవధిలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలిగారు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? ఈ కింది ఫొటో చూడండి.. ఆ పువ్వుల మీద వాలి ఉన్న సీతకాకోచిలుక మీకు కనబడుతుంది.

puzzle2.jpg


ఇవి కూడా చదవండి..

Ice Bath Video: వావ్.. ఏం ఐడియా గురూ.. వేసవిలో చన్నీళ్ల స్నానానికి సూపర్ ట్రిక్..


Piggy Bank: అదృష్టం ఇలా కూడా వరిస్తుందా.. బురదలో దొరికిన ఓ వస్తువు అతడిని కోటీశ్వరుడిని చేసింది..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 11 , 2025 | 03:11 PM