New Zealand Solo Traveler: విదేశీ మహిళకు చేదు అనుభవం.. యువకుడి వింత కోరిక..
ABN , Publish Date - Nov 18 , 2025 | 01:21 PM
శ్రీలంక దేశంలో ఒంటరిగా పర్యటిస్తున్న ఓ విదేశీ మహిళతో యువకుడు తప్పుగా ప్రవర్తించాడు. తన కోరిక తీర్చాలంటూ ఆమెను వేధించాడు. ఆమె ఒప్పుకోకపోవటంతో నీచమైన పని చేశాడు.
శ్రీలంకలో పర్యటిస్తున్న ఓ విదేశీ మహిళకు అత్యంత దారుణమైన అనుభవం ఎదురైంది. రోడ్డుపై వెళుతున్న ఆమెపై ఓ యువకుడు వేధింపులకు పాల్పడ్డాడు. తన కోరికతీర్చమంటూ నీచంగా ప్రవర్తించాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్‌కు చెందిన ఓ మహిళ ఒంటరిగా శ్రీలంకలో పర్యటిస్తోంది. గురువారం టుక్ టుక్ వాహనంలో రోడ్డుపై వెళుతూ ఉంది. 23 ఏళ్ల ఓ యువకుడు ఆమెను చూశాడు. వెంటనే టుక్ టుక్ వాహనం దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. వాహనాన్ని ఆపాడు.
ఆ వెంటనే తన కోరిక తీర్చాలని ఆమెను అడిగాడు. ఆమె షాక్ అయింది. అందుకు నో చెప్పింది. ఆ యువకుడు అంతటితో ఆగకుండా మరింత నీచంగా ప్రవర్తించాడు. ఆమె గుండె ఒక్కసారిగా ఝల్లుమంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాహనాన్ని ముందుకు పోనిచ్చింది. సంఘటనకు సంబంధించిన దృశ్యాలు టుక్ టుక్ వాహనంలో ఉన్న కెమెరాలో రికార్డు అయ్యాయి. బాధితురాలు ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ‘ఈ సంఘటన వల్ల నేను నా ట్రిప్‌ను క్యాన్సిల్ చేసుకోను.
నా కాన్ఫిడెన్స్ కొంత దెబ్బ తిన్న మాట వాస్తవమే. ఒంటరిగా పర్యటిస్తున్న మహిళగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇలా జరిగి ఉండాల్సింది కాదు. నాకు అతడిపై చాలా కోపంగా ఉంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక, ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. యువకుడిపై చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులు స్థానిక పోలీసులను ఆదేశించారు. సోమవారం పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.
ఇవి కూడా చదవండి
పత్తి రైతుల సమస్యలు పరిష్కరించరా.. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
విజయవాడలో మావోల కదలికలు.. పోలీసుల అలర్ట్