Share News

Kantara Chapter 1: ఊహించని విషాదం.. 33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..

ABN , Publish Date - May 13 , 2025 | 10:59 AM

Kantara Chapter 1: కాంతార నటుడు రాకేష్ మరణంపై కర్కాలా టౌన్ పోలీసులకు సమాచారం అందింది. అసహజ మరణం కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాకేష్ మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.

Kantara Chapter 1: ఊహించని విషాదం.. 33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
Kantara Chapter 1

కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంతార చాప్టర్ 1 నటుడు రాకేష్ పూజారి కన్నుమూశాడు. 33 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయాడు. అది కూడా గుండెపోటుతో అతడు చనిపోవటం విషాదకరం. నిన్న ఉడిపిలో జరిగిన ఓ మెహందీ ఫంక్షన్‌లో రాకేష్ పాల్గొన్నాడు. మిత్రులతో కలిసి సందడి చేశాడు. వారితో మాట్లాడుతూ ఉండగానే అతడికి గుండె పోటు వచ్చింది. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్నేహితులు రాకేష్‌ను వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. రాకేష్‌ను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే అతడు చనిపోయినట్లు ధ్రువీకరించారు.


కార్డియాక్ అరెస్ట్ కారణంగా అతడు చనిపోయినట్లు తెలుస్తోంది. రాకేష్ మరణంపై కర్కాలా టౌన్ పోలీసులకు సమాచారం అందింది. అసహజ మరణం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాకేష్ మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు చిత్ర ప్రముఖులు రాకేష్ మరణంపై స్పందిస్తున్నారు. ఇడియట్ సినిమా హీరోయిన్ రక్షిత.. రాకేష్ మరణంపై ఎమోషనల్ పోస్టు పెట్టింది. సోమవారం సాయంత్రం రాకేష్ ఇంటి దగ్గరకు వెళ్లి భౌతిక దేహానికి నివాళులు అర్పించింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..


‘ నాకు చాలా కాలం నుంచి రాకేష్ తెలుసు. కామెడీ కిలాడిగళు షోలో విజయం సాధించాడు. తెర ముందు ఎంత ప్రతిభ ఉందో.. తెర వెనుకాల అంతకంటే మంచి వ్యక్తిత్వం అతడికి ఉంది. కామెడీ కిలాడిగళు షోకు సంబంధించిన వాళ్లమంతా ఓ కుటుంబంలా ఉండేవాళ్లం. రాకేష్ ఇంత తొందరగా మిమ్మల్ని వదలి వెళ్లి పోవాల్సి వచ్చింది. అతడిది చాలా చిన్న వయసు. అతడి తండ్రి రెండు సంవత్సరాల క్రితం చనిపోయాడు. వాళ్ల ఇంట్లో అతడే పెద్ద దిక్కు. రాకేష్ తల్లి, చెల్లిని చూస్తే నాకు చాలా బాధగా ఉంది. రాకేష్ ఆత్మకు శాంతి కలగాలి. దర్శన్ కూడా ఫోన్ చేసి రాకేష్ గురించి అడిగాడు’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

Meerut Blue Drum Case: బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..

Cyber Attacks: భారత్‌పై 15 లక్షల సైబర్ అటాక్స్ చేసిన పాక్..

Updated Date - May 13 , 2025 | 10:59 AM