Snake Control Tips: పాములు ఇళ్లల్లోకి వస్తున్నాయా.. అయితే ఇలా చేయండి..
ABN , Publish Date - May 05 , 2025 | 03:57 PM
Snake Control Tips: గ్రామాల్లో ఇళ్లల్లోకి పాములు ప్రవేశించడం సర్వసాధారణమనే చెప్పుకోవాలి. గ్రామాల్లో ఉండే వారికి తరచూ పాములు కనిపిస్తూనే ఉంటాయి. కొంత మంది చాలా ధైర్యంగా పాములను ఎదుర్కుంటారు. పామును తరిమేస్తారు లేదా చంపేస్తుంటారు.

పాము అంటే చాలా మందికి భయం. దాన్ని చూస్తే చాలు అల్లంత దూరం పారిపోతుంటారు. సాధారణంగా పాము ఇంట్లోకి వచ్చిందంటే దాన్ని తరిమేసేదాకా ఊరుకోరు. విషపూరితమైన పాము కనబడిందంటే చాలు ప్రజలు భయంతో వణికిపోతుంటారు. అదెక్కడ కాటు వేస్తుందో అని భయాందోళనకు గురవుతుంటారు. పాము కనబడితే తరిమేయడమో లేదా చంపడమో చేస్తుంటారు. పట్టణాల్లో కంటే కూడా పల్లెటూర్లలో పాములు ఎక్కువగా ఇళ్లల్లోకి ప్రవేశిస్తుంటాయి. అయితే పాము కనిపించినప్పుడు దాన్ని చంపడం కంటే.. ఒక రకమైన ద్రవాన్ని పిచికారీ చేస్తే చాలు. పాములు మీ ఇళ్లల్లోకి రాకుండా ఉంటాయి. ఇంతకీ ఆ ద్రవం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రామాల్లో ఇళ్లల్లోకి పాములు ప్రవేశించడం సర్వసాధారణమనే చెప్పుకోవాలి. గ్రామాల్లో ఉండే వారికి తరచూ పాములు కనిపిస్తూనే ఉంటాయి. కొంత మంది చాలా ధైర్యంగా పాములను ఎదుర్కుంటారు. పామును తరిమేస్తారు లేదా చంపేస్తుంటారు. అయితే పాము మీ ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేస్తే పాము అసలు దరికి రాకుండా చూసుకోవచ్చు. పామును చంపకుండానే దాన్ని తరిమేయవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో పాములు ఇళ్లలోకి రాకుండా ఇళ్ల ముందు గుర్రపుముల్లంగి అనే మొక్కలను పెంచుతుంటారు. ఈ మొక్కల వల్ల పాములు మన దగ్గరకు రావని చెబుతుంటారు. అలాగే పాము కనిపించిన సమయంలో దానిపై కిరోసిన్ చల్లితే కూడా అవి దూరంగా వెళ్లిపోతాయని కూడా చెబుతుంటారు.
AP Liquor Scam Latest Update: లిక్కర్ స్కాం.. జగన్ బ్యాచ్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ
పాముకు కిరోసిన్ వాసన పడదు. దీంతో పాము ఉన్న ప్రాంతాల్లో కిరోసిన్ చల్లితే ఆ వాసనకు పాము ఇళ్లు వదిలి వెళ్లిపోతుంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఇలా చేస్తారని తెలుస్తోంది. అయితే పామును తరిమికొట్టడంలో ఈ చర్య ఎంత వరకు విజయవంతం అయ్యిందో అనేది చెప్పడం మాత్రం కష్టం. కానీ గిరిజన ప్రజలు మాత్రం పాము వస్తే కిరోసిన్‌ను చల్లుతారని తెలుస్తోంది. పాములు సాధారణంగా చెట్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో, పచ్చటి గడ్డి ఉన్న స్థల్లాలో ఎక్కువగా సంచరిస్తుంటాయి. అలాంటి ప్రదేశాల్లో నివాసాలు ఉంటే మాత్రం పాములు కచ్చితంగా ఆ ఇళ్లల్లోకి వెళ్లడం ఖాయం. ముఖ్యంగా వర్షా కాలంలోనే పాము కాటుకు గురై మరణించిన సంఘటనలు ఎక్కువనే చెప్పుకోవాలి. అయితే వేసవి కాలంలో కూడా పాములు ఎండ వేడిమి తట్టుకోలేక కూడా చెట్లు, పొదల నుంచి బయటకు వస్తుంటాయి.
అయితే పాము కాటు వేసినప్పడు భయపడకుండా ధైర్యంగా ఆ పరిస్థితిని ఎదుర్కోవడం ముఖ్యం. పాము కాటుకు గురైన వెంటనే ఏం చేయాలో తెలుసుకోవాలి. పాము కాటుకు గురైన వ్యక్తికి తక్షణమే వైద్య చికిత్స అవసరం. దీంతో అతడిని వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి. పాముకాటుకు గురైన వ్యక్తిని సరైన సమయంలో ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడవొచ్చు.
(ఈ వార్త ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనికి ఏ విధమైన సైంటిఫిక్ ఆధారాలు లేవని గమనించగలరు).
ఇవి కూడా చదవండి
Drunk Driving Incident: మద్యం తాగుతూ ఫుల్ స్పీడ్‌తో రైడ్.. వీడియో వైరల్
Hariram ACB Case: హరిరామ్ ఏసీబీ కస్టడీ.. నేడు, రేపు అత్యంత కీలకం
Read Latest Pratyekam News And Telugu News