Share News

Sai Rajeshs Film: సాయి రాజేష్‌కు షాకిచ్చిన బాబిల్.. బేబీ రీమేక్‌నుంచి ఔట్..

ABN , Publish Date - May 18 , 2025 | 08:53 AM

Baby Movie Remake: బాబిల్ ఖాన్ గత కొంత కాలం నుంచి డిప్రెషన్‌లో ఉన్నాడు. కొద్దిరోజుల క్రితం బాలీవుడ్‌కు చెందిన కొంతమంది స్టార్ కిడ్స్‌పై తీవ్ర స్థాయిలో కామెంట్లు కూడా చేశాడు. ఇప్పుడిలా సడెన్‌గా బేబీ రీమేక్ నుంచి తప్పుకున్నాడు.

Sai Rajeshs Film: సాయి రాజేష్‌కు షాకిచ్చిన బాబిల్.. బేబీ రీమేక్‌నుంచి ఔట్..
Baby Movie Remake

సాయి రాజేష్ దర్శకత్వం వహించిన బేబీ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు నాట 100 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న బేబీని సాయి రాజేష్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ప్రముఖ బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్‌ను ఓ పాత్ర కోసం ఎంపిక చేశాడు. బేబీ రీమేక్‌కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం సాయి రాజేష్ చాలా కష్టపడుతున్నాడు.


హిందీలో కూడా సూపర్ సక్సెస్ చేయాలని చూస్తున్నాడు. అందుకే పాత్రల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. మరీ ముఖ్యంగా బాబిల్ ఖాన్ పాత్రను అందరికీ గుర్తుండిపోయేలా చేయాలని అనుకున్నాడు. అయితే, గత కొద్దిరోజుల నుంచి బాబిల్ జీవితంలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో బాబిల్ ఖాన్ .. సాయి రాజేష్‌కు షాక్ ఇచ్చాడు. బేబీ రీమేక్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టాడు. ఆ పోస్టులో .. ‘ నేను, సాయి రాజేష్ కలిసి మ్యాజిక్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అనుకోని పరిణామాల వల్ల అంతా నాశనం అయింది’ అని పేర్కొన్నాడు.

BABIL.jpg


సాయి రాజేష్ కూడా బాబిల్ సినిమా నుంచి తప్పుకోవటంపై స్పందించాడు. ‘ నా జీవితంలో నేను కలిసిన నటుల్లో బాబిల్ ఎంతో ప్రతిభ కలిగిన వ్యక్తి. కానీ, కొన్ని నిజాలను అంగీకరించకతప్పదు. అతడితో కలిసి కొంతకాలం పని చేయటం చాలా సంతోషంగా అనిపించింది. అతడి నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను. భవిష్యత్తులో ఇద్దరం కలిసి కచ్చితంగా మ్యాజిక్ క్రియేట్ చేస్తాం’ అని అన్నాడు. బాబిల్ గత కొంత కాలం నుంచి డిప్రెషన్‌లో ఉన్నాడు. కొద్దిరోజుల క్రితం బాలీవుడ్‌కు చెందిన కొంతమంది స్టార్ కిడ్స్‌పై కామెంట్లు కూడా చేశాడు. ఇప్పుడిలా సడెన్‌గా సినిమా నుంచి తప్పుకున్నాడు.


ఇవి కూడా చదవండి

Tragedy After Marriage: కొత్త జీవితం ఇంత విషాదంగా ముగుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు..

Gold And Silver Rate: పసిడి ప్రియులకు ఊరట.. నిలకడగా బంగారం ధరలు..

Updated Date - May 18 , 2025 | 09:01 AM