CID 2 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు.. ఆయన బతికే ఉన్నాడు
ABN , Publish Date - Apr 20 , 2025 | 07:04 AM
CID 2 ACP Pradyuman: సీఐడీ ఫ్యాన్స్ పోరాటం ఫలించింది. ఏసీపీ ప్రద్యుమన్ క్యారెక్టర్ విషయంలో సోనీ వెనక్కు తగ్గింది. శివాజీ సతమ్ మళ్లీ సీరియల్‌లోకి కమ్ బ్యాక్ ఇచ్చారు. కొత్త ఏసీపీ పార్థ్ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

బుల్లితెరలో సీరియల్స్ చూసే వారికి సీఐడీ సీరియల్ గురించి పరిచయం అక్కర్లేదు. హిందీ సీరియల్ అయినప్పటికి ఇతర భాషల్లో కూడా డబ్ అయింది. హిందీతో సమానంగా క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా నైంటీస్ కిడ్స్‌కు ఇష్టమైన క్రైమ్ షోలలో ఇదే మొదటి స్థానంలో ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న సీఐడీ సీజన్ 1 చాలా నెలల క్రితమే ముగిసింది. ప్రస్తుతం సీజన్ 2 కొనసాగుతోంది. ఫిబ్రవరి నెల వరకు సీజన్ 2కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీఆర్‌పీ అదరగొట్టింది. ఫిబ్రవరి తర్వాతి నుంచి టీఆర్‌పీ తగ్గుతూ వచ్చింది.
ఈ నేపథ్యంలోనే సోనీ కీలక నిర్ణయం తీసుకుంది. సీరియల్‌లో ప్రధాన పాత్ర అయిన ఏసీపీ ప్రద్యుమన్‌ను చంపేసింది. ఒకరకంగా చెప్పాలంటే ప్రద్యుమన్ క్యారెక్టర్‌ను తీసేసింది. ఆ పాత్రలో నటించిన శివాజీ సతమ్ స్థానంలో మరో సెలెబ్రిటీని తీసుకురావాలని భావించింది. అదే పని చేసింది. పార్థ్ సమతాన్ అనే నటుడ్ని కొత్త ఏసీపీగా పరిచయం చేసింది. కొన్ని ఎపిసోడ్లు కూడా శరావేగంగా సాగాయి. సోనీ టీవీ తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియా వ్యాప్తంగా రచ్చకు దారి తీసింది. దేశ వ్యాప్తంగా ఉన్న సీఐడీ ఫ్యాన్స్.. ప్రద్యుమన్ పాత్రను తీసేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోనీకి వ్యతిరేకంగా పోస్టు పెట్టడం మొదలెట్టారు. ఈ నేపథ్యంలోనే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. సీఐడీ సీజన్ 2లో ఏసీపీ ప్రద్యుమన్ చచ్చిపోలేదు. పార్థ్ సమతాన్ ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించాడు. సీఐడీ 2 షూటింగ్‌లో పార్థ్‌తో పాటు శివాజీ సతమ్ కూడా పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పార్థ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ‘ ఏసీపీ ప్రద్యుమన్ అలియాస్ శివాజీ సతమ్‌తో కలిసి నటించటం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన అద్భుతమైన వ్యక్తి’ అని పేర్కొన్నాడు. మొత్తానికి ప్రద్యుమన్ ఫ్యాన్స్ పోరాటం ఫలించింది.
ఇవి కూడా చదవండి
Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. ఈ రోజు ధరలు ఎంతంటే..
Fire Safety Awareness: అగ్ని ప్రమాదాల నియంత్రణ అందరి బాధ్యత